భారత్‌లో ఐపీఎల్ సూపర్ సక్సెస్ అవడంతో మిగతా క్రీడల్లో కూడా ఇలాంటి లీగ్స్ నిర్వహించాలనే ఆలోచనలు పెరుగుతున్నాయి. వీటిలో భాగంగానే భారత జాతీయ క్రీడ హాకీ లీగ్‌ను ప్రారంభించారు. ఇది కూడా సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై టీమిండియా హాకీ జట్టు ఫార్వర్డ్, స్టార్ ప్లేయర్ మన్దీప్ స్పందించాడు.
అక్టోబర్ 28 నుంచి ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ మొదలవుతోంది. వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే హాకీ ప్రపంచకప్‌కు సమాయత్తం అయ్యేందుకు ఈ ప్రొ లీగ్ బాగా ఉపయోగపడుతుందని మన్దీప్ అన్నాడు. ‘పెద్ద టోర్నీ జరిగే ముందు బలమైన ప్రత్యర్థులను ఎదుర్కోవడం మంచిదే. ఇది ఆటగాళ్లకు బాగా ఉపయోగపడుతుంది’ అని ఈ స్టార్ ప్లేయర్ చెప్పాడు. వచ్చే ఏడాది జనవరి 13న హాకీ ప్రపంచకప్ ప్రారంభం అవనున్న సంగతి తెలిసిందే.