Cricket | టీ20ల్లో ఎక్కువ నో బాల్స్ వేసింది ఎవరంటే..?
11 ఇన్నింగ్స్‌ల్లో 14 నో బాల్స్ వేసిన అర్షదీప్
Cricket : టీ20ల్లో భారత యంగ్ బౌలర్ అర్షదీప్ సింగ్ కలలో కూడా ఊహించని రికార్డు సాధించాడు. అత్యధిక నో బాల్స్ వేసిన బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇప్పటి వరకు 11 ఇన్నింగ్స్‌లు ఆడిన అర్షదీప్ ఖాతాలో 14 నో బాల్స్ ఉన్నాయి. పాకిస్థాన్ బౌలర్ హసన్ అలీ రెండో స్థానంలో ఉన్నాడు. హసన్ 9 ఇన్నింగ్స్‌ల్లో 11 నో బాల్స్ వేశాడు. టీ20ల్లో ఆరు ఇన్సింగ్స్‌లు ఆడిన వెస్టిండీస్ బౌలర్ కీమో పాల్ ఖాతాలో 11 నో బాల్స్ ఉన్నాయి. అదే జట్టుకు చెందిన మరో బౌలర్ ఒషానే థామస్ కూడా 11 నో బాల్స్ వేశాడు.
జనవరి 5న శ్రీలంకతో పూణేలో జరిగిన రెండో టీ20లో అర్షదీప్ ఏకంగా 5 నో బాల్స్ వేశాడు. తొలి ఓవర్లో మూడు, ఆఖరి ఓవర్లో రెండు నో బాల్స్ వేశాడు. దాంతో, ఒక ఇన్నింగ్స్‌లో ఎక్కువ నో బాల్స్ వేసిన భారత బౌలర్‌గా గుర్తింపు సాధించాడు. గతంలో అతను దక్షిణాఫ్రికా మీద 4 నో బాల్స్ వేశాడు. అత్యధిక నో బాల్స్ వేసిన జట్టుగా ఘనా నిలిచింది. ఉగాండాతో జరిగిన మ్యాచ్‌లో ఘనా బౌలర్లు ఏకంగా 10 నో బాల్స్ వేశారు.
నో బాల్ వేయని క్రికెటర్స్
అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ కాలం ఆడి, ఒక్క నో బాల్ కూడా వేయని బౌలర్లు కొందరు ఉన్నారు. వీళ్లలో భారత మాజీ క్రికెటర్ 1983 వరల్డ్ కప్ హీరో కపిల్ దేవ్ కూడా ఉన్నాడు. అతను 131 టెస్టులు, 225 వన్డేలు ఆడాడు. 79 టెస్టులు, 3 వన్డేలు ఆడిన వెస్టిండీస్ లెజెండరీ స్పిన్సర్ లాన్సే గిబ్స్ తన కెరీర్లో ఒక్క నో బాల్ వేయలేదు. ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ ఇయాన్ బోథాం తన 16 ఏళ్ల కెరీర్లో నో బాల్ అస్సలు వేయలేదు. 70 టెస్టులు, 63 వన్డేలు ఆడిన ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ ఖాతాలో నో బాల్ అనేదే లేదు. పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ ఇమ్రాన్ ఖాన్ 88 టెస్టులు, 175 వన్డేల్లో నో బాల్ వేయలేదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

