Hardhik Pandya | ఆ మైదానం నాకు గుడితో సమానం.. పాండ్యా వీడియో వైరల్
Hardhik Pandya : భారత జట్టు అభిమానులకు గుడ్ న్యూస్. కాలి మడమ గాయం నుంచి కోలుకుంటున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) ఫిట్నెస్ సాధించాడు. నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ మొదలెట్టాడు. బరోడా క్రికెట్ స్టేడియం...
Hardhik Pandya : భారత జట్టు అభిమానులకు గుడ్ న్యూస్. కాలి మడమ గాయం నుంచి కోలుకుంటున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) ఫిట్నెస్ సాధించాడు. నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ మొదలెట్టాడు. బరోడా క్రికెట్ స్టేడియం(baroda cricket stadium)లో పాండ్యా నెట్స్‌లో చెమటోడ్చాడు. బౌలింగ్ చేస్తున్న వీడియోను పాండ్యా షేర్ చేశాడు.
‘ప్రతి రోజు నా శక్తినంతా ధారపోస్తున్నా’ అని ఆ వీడియోకు పాండ్యా క్యాప్షన్ రాశాడు. ఐపీఎల్ 17వ సీజన్లో పాండ్యా ఆడే చాన్స్ ఉంది. దాంతో, అతడి వీడియో చూసిన విశ్లేషకులు టీ20 వరల్డ్ కప్‌లో ఆల్‌రౌండర్ కొరత తీరినట్టేనని అభిప్రాయపడుతున్నారు.
‘నాకెంతో ఇష్టమైన ప్లేస్‌కు వచ్చినందుకు సంతోషంగా ఉంది. బరోడా గ్రౌండ్ నాకు ఒక దేవాలయం లాంటింది. ఎందుకంటే.. ఇదే మైదానంలో నేను చాలా విషయాలు నేర్చుకున్నా. 17 ఏండ్ల క్రితం క్రికెటర్‌గా నా జర్నీ ఇక్కడే మొదలైంది. మళ్లీ ఇక్కడికి వచ్చినందుకు ఆనందంగా ఉన్నా’ అని పాండ్యా తెలిపాడు. నిరుడు సొంతగడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023)లో బంగ్లాదేశ్‌పై బౌలింగ్ చేస్తుండగా పాండ్యా గాయపడ్డాడు. ఎడమ కాలి మడమ మడతపడడంతో మైదానం వీడిన ఈ స్టార్ ఆల్‌రౌండర్ ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నాడు.

ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)ను ఫైనల్‌కు చేర్చిన పాండ్యాను 17వ సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. రోహిత్ శర్మను కెప్టెన్‌గా తప్పించి అతడికి బాధ్యతలు అప్పగించింది. అయితే..టోర్నీ మొదలయ్యే సరికి ఫిట్‌గా ఉంటాడా? లేదా? అనే అనుమానాల నేపథ్యంలో పాండ్యా నెట్స్లోప్రాక్టీస్ మొదలెట్టాడు. దాంతో, త్వరలోనే పునరాగమనం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఈ స్టార్ ఆటగాడు సంకేతాలు ఇచ్చాడు.
ఇవి కూడా చదవండి
- Priyanka Sharma | చూపులతో కట్టిపేడస్తున్న ప్రియాంక శర్మ..
- Under-19 World Cup | 13 బంతుల్లోనే ఫిఫ్టీ.. పంత్ రికార్డు బ్రేక్ చేసిన సఫారీ ఓపెనర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుమారుడితో కలిసి 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ లేఖ
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహం
Graduates Registration | గ్రాడుయేట్ల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Yash | నిజ జీవితంలో నేను రాముడిని.. తెరపై రావణుడిని: యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Kagiso Rabada | టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించిన రబాడా.. తక్కువ బంతులేసి ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

