టీ20 ఫైనల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన రికార్డు వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ మర్లోన్ శామ్యూల్స్ పేరిట ఉంది. 2012లో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో శామ్యూల్స్ ఏకంగా ఆరు సిక్స్‌లు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఇతను 56 బంతుల్లో 78 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టెండీస్ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో శ్రీలంక జట్టు 101 పరుగులకే కుప్పకూలింది. దాంతో, వెస్టిండీస్ జట్టు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన శామ్యూల్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
శామ్యూల్స్ తర్వాత పొట్టి ప్రపంచకప్ ఫైనల్లో ఎక్కువ సిక్స్‌లు బాదిన ఆటగాళ్లు ఎవరంటే… పాకిస్థాన్ బ్యాటర్ మిస్బా ఉల్ హక్ (2007), టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ (2014), వెస్టిండీస్ ఆటగాడు కార్లోస్ బ్రాత్‌వైట్ (2016), ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ మార్ష్ (2021)లు టీ 20 ఫైనల్లో నాలుగు సిక్స్‌లు కొట్టారు.