Suryakumar Yadav | సూర్యకుమార్‌కు సర్జరీ.. హాస్పిటల్ బెడ్ మీది ఫొటో వైరల్
Suryakumar Yadav : భారత టీ20 సంచలనం సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సర్జరీ చేయించుకున్నాడు. స్పోర్ట్స్ హెర్నియా(Sports Hernia)తో బాధ పడుతున్న ఈ స్టార్ ఆటగాడికి బుధవారం జర్మనీలో...
Suryakumar Yadav : భారత టీ20 సంచలనం సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సర్జరీ చేయించుకున్నాడు. స్పోర్ట్స్ హెర్నియా(Sports Hernia)తో బాధ పడుతున్న ఈ స్టార్ ఆటగాడికి బుధవారం జర్మనీలో శస్త్ర చికిత్స జరిగింది. దాంతో, హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఫొటోను మిస్టర్ 360 ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
‘సర్జరీ విజయవంతమైంది. నా ఆరోగ్యం తొందరగా మెరుగవ్వాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నా. త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తాను’ అని సూర్య తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
వైద్య పరిభాషలో స్పోర్ట్స్ హెర్నియాను ‘అథ్లెటిక్ పుబల్జియా'(Athletic Publgia) అని పిలుస్తారు. పొత్తి కడుపు కింది భాగంలో లేదా గజ్జల(Groin) భాగంలోని మృదువైన కణజాలంలోని కండరాలు లేదా టిండాన్, లిగమెంట్ దెబ్బతినడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. అంతేకాదు ఉన్నట్టుండి ఒక్కసారిగా కదలడం వల్ల తుంటి భాగంలో ఉండే కణజాలం, కండరాలు దెబ్బతింటాయి. దాంతో స్పోర్ట్స్ హెర్నియా వచ్చే అవకాశం ఉంది.

ఫుట్‌బాల్, రెజ్లింగ్, ఐస్ హాకీ ఆడేవాళ్లలో చాలావరకు ఈ సమస్య కనిపిస్తుంది. అప్పుడప్పుడు క్రికెటర్లలోనూ ఈ ఇబ్బంది కనిపిస్తుంటుంది. రెండేండ్ల క్రితం భారత వికెట్ కీపర్ కేఎల్ రాహుల్(KL Rahul) కూడా ఈ సమస్యతో బాధపడ్డాడు. 2002 జూలైలో సర్జరీ చేయించుకొన్న రాహుల్ పునరాగమనంలో పరుగుల వరద పారిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి
- Pakistan | ఇరాన్‌పై పాకిస్థాన్ ప్రతీకార దాడులు
- CM Arvind Kejriwal | నేడు గోవాకు ఢిల్లీ సీఎం.. ఈడీ విచారణకు కేజ్రీవాల్ మళ్లీ గైర్హాజరు!
- Rohit Sharma | నేను ప్రతి ఒక్కరిని సంతోషపెట్టలేను.. కెప్టెన్‌గా నా ఏకైక లక్ష్యమదే..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasyam Vinay Bhaska | పార్టీలు మారడమే కడియం కమిట్మెంట్ : దాస్యం వినయ్ భాస్కర్
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రస్థానం ముగిసింది : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
Hepatitis B | హెపటైటిస్ బి వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఆమోదం తెలిపిన అమెరికా ఎఫ్‌డీఏ..
రోడ్డు మరమ్మతులు చేపట్టాలని టిప్పర్ డ్రైవర్ల నిరసన
MLA Sudheer Reddy | ఎవరి గూడు చెదరనివ్వబోం.. మూసీ పునరుద్ధరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

