Suryakumar Yadav | మిస్టర్ 360 ప్లేయర్‌కు ‘స్పోర్ట్స్ హెర్నియా’.. జర్మనీలో సర్జరీ
Suryakumar Yadav : భారత స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) మరికొన్నాళ్లు ఆటకు దూరం కానున్నాడు. దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో కాలికి అయిన గాయం మానక ముందే ఈ మిస్టర్ 360 ప్లేయర్ 'స్పోర్ట్స్ హెర్నియా'(Sports Hernia)...
Suryakumar Yadav : భారత స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) మరికొన్నాళ్లు ఆటకు దూరం కానున్నాడు. దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో కాలికి అయిన గాయం మానక ముందే ఈ మిస్టర్ 360 ప్లేయర్ ‘స్పోర్ట్స్ హెర్నియా'(Sports Hernia) బారిన పడ్డాడు. ఈ సమస్య తగ్గాలంటే సర్జరీనే పరిష్కారం. దాంతో, సూర్య త్వరలోనే జర్మనీకి వెళ్లి అక్కడ సర్జరీ చేయించుకోనున్నాడు. టీ20ల్లో పరుగుల వరద పారిస్తున్న సూర్య జూన్‌లో మొదలయ్యే పొట్టి ప్రపంచ కప్ కల్లా ఫిట్‌గా మారే చాన్స్ ఉంది.
‘వైద్య పరీక్షల అనంతరం సూర్యకు స్పోర్ట్స్ హెర్నియా వచ్చిందని తేలింది. ప్రస్తుతం అతడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. ఈ రెండు మూడు రోజుల్లో సూర్య సర్జరీ కోసం జర్మనీలోని మ్యూనిచ్కు వెళ్లనున్నాడు. దాంతో, ఈ స్టార్ బ్యాటర్ ఈ ఏడాది దేశవాళీతో పాటు ఐపీఎల్ 17వ సీజన్లో పలు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు’ అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.
స్పోర్ట్స్ హెర్నియా అంటే..?
స్పోర్ట్స్ హెర్నియాను వైద్య పరిభాషలో ‘అథ్లెటిక్ పుబల్జియా'(Athletic Publgia) అని కూడా పిలుస్తారు. పొత్తి కడుపు కింది భాగంలోని లేదా గజ్జల(Groin) భాగంలోని మృదువైన కణజాలంలోని కండరాలు లేదా టిండాన్ లేదా లిగమెంట్ దెబ్బతినడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా కదలడం వల్ల తుంటి భాగంలో ఉండే కణజాలం, కండరాలు దెబ్బతిని స్పోర్ట్స్ హెర్నియా వస్తుంది.

అయితే.. చాలావరకు ఫుట్‌బాల్, రెజ్లింగ్, ఐస్ హాకీ వంటి ఆటలు ఆడేవాళ్లు అకస్మాత్తుగా కదలడం వల్ల ఈ సమస్య బారిన పడుతుంటారు. అప్పుడప్పుడు క్రికెటర్లలోనూ ఈ ఇబ్బంది కనిపిస్తుంటుంది. అవును.. రెండేండ్ల క్రితం భారత వికెట్ కీపర్ కేఎల్ రాహుల్(KL Rahul) కూడా ఈ సమస్యతో బాధపడ్డాడు. 2002 జూలైలో సర్జరీ చేయించుకొని మళ్లీ పునరాగమనం చేశాడు.
ఇవి కూడా చదవండి
- Gulmarg: మంచులేని కశ్మీర్.. వెలవెలబోతున్న గుల్మార్గ్
- Chandini Tamilarasan | కాటుక కన్నులతో కవ్విస్తున్న చాందిని తమిళరసన్..
- Praveen Kumar | ఆర్సీబీకి ఆడాలని బెదిరించాడు.. ఐపీఎల్ ఫౌండర్‌పై మాజీ పేసర్ సంచలన వ్యాఖ్యలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Story competition | కథల పోటీలో ప్రతిభ చాటిన పావని
Sai Pallavi | ‘రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు’.. సాయి పల్లవి వ్యాఖ్యలపై నెట్టింట దుమారం!
AP news | అర్నబ్ తుపానుతో అతలాకుతలం.. ఏపీలో నేడూ ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
Osmania University | ఓయూలో పెన్‌డౌన్.. సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల నిరసన
Janhvi Kapoor | ‘పెద్ది’ వివాదంపై జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు.. అది నా తప్పే అంటూ కామెంట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

