Asian Games 2023 : భారత టెన్నిస్ ప్లేయర్లు ఆసియా గేమ్స్(Asian Games 2023)లో దుమ్మురేపుతున్నారు. టాప్ సీడ్ సుమిత్ నగల్(Sumit Nagal), అంకిత్ రైనా(Ankit Raina) క్వార్టర్స్‌లో అడుగు పెట్టారు. దాంతో, పతకానికి అడుగు దూరంలో నిలిచారు. పురుషుల సింగిల్స్‌లో సుమిత్ తన పదునైన ఏస్‌లతో కజకిస్థాన్ ఆటగాడు బీబిత్ ఝుకయేవ్(Beibit Zhakayev)ను మట్టికరిపించాడు. ఆరంభం నుంచి ధాటిగా ఆడిన సుమిత్ 7-6, 6-4తో సునాయసంగా గెలిచాడు.
భారత సంచలనం అంకిత్ రైనా మహిళల సింగిల్స్‌లో సత్తా చాటింది. ఈ రోజు జరిగిన ప్రీ క్వార్టర్స్‌లో ఆమె హాంకాంగ్‌కు చెందిన ఆదిత్య కరుణరత్నే(Aditya Karunaratne)ను 6-1, 6-2తో చిత్తుగా ఓడించింది. సెమీఫైనల్ పోరులో అంకిత్ జపాన్ ప్లేయర్ హరుక కజీ(Hauka Kaji)తో తలపడనుంది.
ఈరోజుతో సింగిల్స్‌లో ఇండియా ప్లేయర్లు రామ్‌కుమార్ రామనాథన్(Ramkumar Ramanathan), రుతుజా భోసాలే(Rutuja Bhosale) పోరాటం ముగిసింది. గంట 40 నిమిషాలు జరిగిన మ్యాచ్‌లో జాపాన్ ఆటగాడు యొసుకే వతనుకీ చేతిలో 7-5, 6-7, 7-5తో ఓడిపోయాడు. రుతుజా ఫిలీప్పీన్స్ క్రీడాకారిణి అలెగ్జాండ్ర ఈల చేతిలో 67-, 5-2తో పరాజయం పాలైంది.