David Warner | టెస్టుల్లో వార్నర్ చెత్త రికార్డు.. అతడి కంటే ముందున్నది వీళ్లే..!
David Warner : ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner) టెస్టుల్లో చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఒకే బౌలర్ చేతిలో 16 సార్లు ఔటైన క్రికెటర్‌గా ఈ డాషింగ్ ఓపెనర్ గుర్తింపు సాధించాడు. యాషెస్ సిరీస్(Ashes Series) మూడో టెస్టులో 4 పరుగుల వద్ద వార్నర్ ఇంగ్లండ్ పేసర్ స్టువార్ట్ బ్రాడ్(Stuart Broad) ఓవర్లో జాక్....
David Warner : ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner) టెస్టుల్లో చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఒకే బౌలర్ చేతిలో 16 సార్లు ఔటైన క్రికెటర్‌గా ఈ డాషింగ్ ఓపెనర్ గుర్తింపు సాధించాడు. యాషెస్ సిరీస్(Ashes Series) మూడో టెస్టులో 4 పరుగుల వద్ద వార్నర్ ఇంగ్లండ్ పేసర్ స్టువార్ట్ బ్రాడ్(Stuart Broad) ఓవర్లో జాక్ క్రాలేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ ఫార్మాట్లో ఒకే బౌలర్ చేతిలో ఎక్కువ సార్లు ఔటైంది ఎవరో తెలుసా..? ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైఖేల్ ఆర్థర్టన్(Michael Atherton).
అతను 19 సార్లు ఆసీస్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్(Glenn McGrath) బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మరో ఇంగ్లండ్ క్రికెటర్ అలెక్ బెడ్సర్(Alec Bedser) రెండో స్థానంలో ఉన్నాడు. బెడ్సర్ను ఆస్ట్రేలియా బౌలర్ ఆర్థర్ మోరిస్ 18 సార్లు ఔట్ చేశాడు. వెస్టిండీస్ లెజెండరీ బౌలర్లు అంబ్రోస్, కౌట్నీ వాల్ష్‌లు 17సార్లు మైక్ ఆర్థర్టన్ను పెవిలియన్ పంపారు.
డేవిడ్ వార్నర్, మైఖేల్ ఆర్థర్టన్

42 పరుగులకే రెండు వికెట్లు
యాషెస్ సిరీస్‌లో ఇప్పటివరకు భారీ స్కోర్ చేయని వార్నర్ మరోసారి నిరాశపరిచాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులతో రాణించిన అతను లీడ్స్‌లోని హెడింగ్లే స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్టులో విఫలమయ్యాడు. 4 పరుగులకే బ్రాడ్ ఓవర్లో వెనుదిరిగాడు. ఫామ్‌లో ఉన్న మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(13)ను మార్క్ బౌల్డ్ చేయడంతో 42 పరుగుల వద్దే ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయింది. ఆదుకుంటారనుకున్న మార్నస్ లబూషేన్(21), స్టీవ్ స్మిత్(22) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. ప్రస్తుతం ట్రావిస్ హెడ్(17 నాటౌట్), మిచెల్ మార్ష్(32 నాటౌట్) ఆడుతున్నారు. ఐదు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-0తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
PSL Franchise Owner Suicide | పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో విషాదం.. ముల్తాన్ సుల్తాన్ జట్టు యజమాని ఆత్మహత్య
Rinku Singh | రింకూ సింగ్‌కు న్యాయం చేయాలి.. బీసీసీఐని విమర్శిస్తూ వెల్లువెత్తుతున్న పోస్ట్‌లు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

