Steve Smith | టెస్టుల్లో 32వ సెంచరీ.. ఆస్ట్రేలియా లెజెండ్ రికార్డు సమం చేసిన స్మిత్
Steve Smith : యాషెస్ సిరీస్(Ashes Series)లో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్(Steve Smith) సెంచరీలతో కదం తొక్కుతున్నాడు. లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో అతను సెంచరీతో మెరిశాడు. టెస్టుల్లో స్మిత్‌కు ఇది 32వ శతకం. దాంతో ఆస్ట్రేలియా లెజెండ్....
Steve Smith : యాషెస్ సిరీస్(Ashes Series)లో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్(Steve Smith) సెంచరీలతో కదం తొక్కుతున్నాడు. లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో అతను సెంచరీతో మెరిశాడు. టెస్టుల్లో స్మిత్‌కు ఇది 32వ శతకం. దాంతో ఆస్ట్రేలియా లెజెండ్ స్టీవ్ వా(Steve Waugh) టెస్టు సెంచరీల రికార్డును అతను సమం చేశాడు. అలాగే.. ఆసీస్ తరఫున అత్యధిక శతకాలు బాదిన రెండో ఆటగాడిగా స్మిత్ పేరు తెచ్చుకున్నాడు.
ఈ జాబితాలో మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (Ricky Ponting)41సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. అంతేకాదు వేగంగా 32 సెంచరీలు కొట్టిన తొలి క్రికెటర్‌గా స్మిత్ మరో ఘనత సాధించాడు. 99వ టెస్టు ఆడుతున్న ఈ స్టార్ ప్లేయర్ 174 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సొంతం చేసుకున్నాడు.
స్టీవ్ వాతో స్మిత్

ఎడ్జ్‌బాస్టన్(Edgebaston) టెస్టులో స్మిత్ వంద కొట్టిన విషయం తెలిసిందే. రెండో టెస్టులోనూ అతను తన ఫామ్ కొనసాగించాడు. రెండో టెస్టులో.. ఓవర్ నైట్ స్కోర్ 85తో రెండో రోజు క్రీజులోకి వచ్చిన స్మిత్ వేగంగా ఆడాడు. అండర్సన్ బౌలింగ్‌లో కవర్ డ్రైవ్‌తో బౌండరీ కొట్టి వందకు చేరువయ్యాడు. అయితే.. వేగంగా ఆడే క్రమంలో జోష్ టంగ్ ఓవర్లో బెన్ డకెట్ చేతికి చిక్కి ఔటయ్యాడు. రాబిన్సన్ మూడు, రూట్ రెండేసి వికెట్లతో చెలరేగడతో తొలి సెషన్లోనే ఆసీస్ 416 పరుగులకే కుప్పకూలింది.
ఇవి కూడా చదవండి
Rajasthan Royals | బట్లర్‌తో రాజస్థాన్ రాయల్స్ భారీ డీల్.. 4 ఏళ్లకు రూ.కోట్లలో ముట్టజెప్పనుంది..?
VVS Laxman Son Sarvajith | క్రికెట్లో దూసుకొస్తున్న లక్ష్మణ్ వారసుడు.. హెచ్‌సీఏ డివిజన్ మ్యాచ్‌లో సెంచరీ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కరువు సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలి’
ప్రజలకు ముఖం చాటేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
Dasyam Vinay Bhaska | పార్టీలు మారడమే కడియం కమిట్మెంట్ : దాస్యం వినయ్ భాస్కర్
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రస్థానం ముగిసింది : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
Hepatitis B | హెపటైటిస్ బి వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఆమోదం తెలిపిన అమెరికా ఎఫ్‌డీఏ..
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

