Rajasthan Royals | బట్లర్‌తో రాజస్థాన్ రాయల్స్ భారీ డీల్.. 4 ఏళ్లకు రూ.కోట్లలో ముట్టజెప్పనుంది..?
Rajasthan Royals : ఐపీఎల్ 16వ సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు విధ్వంసక ఆటగాడు జోస్ బట్లర్ (Jos Buttler)తో దీర్ఘకాల ఒప్పందం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. అవును.. ఈ విషయాన్ని బ్రిటన్ పత్రిక 'టెలిగ్రాఫ్'(Telegraph) గురువారం ప్రచురించింది. 'ఇంగ్లండ్ వన్డే, టీ20 కెప్టెన్ జోస్ బట్లర్‌కు ఐపీఎల్ ఫ్రాంచైజీ...
Rajasthan Royals : ఐపీఎల్ 16వ సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు విధ్వంసక ఆటగాడు జోస్ బట్లర్ (Jos Buttler)తో దీర్ఘకాల ఒప్పందం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. అవును.. ఈ విషయాన్ని బ్రిటన్ పత్రిక ‘టెలిగ్రాఫ్'(Telegraph) గురువారం ప్రచురించింది. ‘ఇంగ్లండ్ వన్డే, టీ20 కెప్టెన్ జోస్ బట్లర్‌కు ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ జట్టు నాలుగేళ్ల కాంట్రాక్టు ఆఫర్ చేయనుంది. అయితే.. అతడికి ఎంత డబ్బు ముట్టజెప్పనుంది అనేది తెలియదు.
అంతేకాదు.. రాజస్థాన్ ఆఫర్‌కు బట్లర్ ఒప్పుకుంటాడా? లేదా? అనేది కూడా తెలియాల్సి ఉంది’ అని తన రిపోర్టులో టెలిగ్రాఫ్ వెల్లడించింది. బట్లర్‌తో డీల్ రూ. కోట్లలో ఉండనుందని టాక్. అయితే.. ఈ విషయాన్ని రాజస్థాన్ ఫ్రాంచైజీ మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.
5 సెంచరీలు, 17 అర్ధ శతకాలు
ప్రపంచంలోని మేటి క్రికెటర్లలో ఒకడైన బట్లర్ ఆట గురించి తెలిసిందే. క్రీజులో అడుగుపెట్టిందే ఆలస్యం ఈ చిచ్చరపిడుగు బౌలర్లపై విరుచుకుపడుతాడు. ఐపీఎల్‌లోనూ బట్లర్ తనదైన శైలిలో మరుపురాని ఇన్నింగ్స్‌లు ఆడాడు. 2018లో రాజస్థాన్ జట్టు అతడిని రూ.4.4 కోట్లకు కొనుగోలు చేసింది. యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఈ ఇంగ్లండ్ కెప్టెన్ వమ్ము చేయలేదు. 2022 సీజన్(IPL 2023)లో బట్లర్ ఆకాశామే హద్దుగా చెలరేగి జట్టును ఫైనల్‌కు చేర్చాడు.
16వ సీజన్లో నిరాశపరిచిన బట్లర్

అయితే.. 16వ సీజన్(IPL 2023)లో ఎక్కువ పరుగులు సాధించలేకపోయాడు. కేవలం రెండు అర్థ సెంచరీలతో నిరాశపరిచాడు. ఇప్పటి వరకు రాజస్థాన్ తరఫున బట్లర్ 5 సెంచరీలు, 17 అర్ధ శతకాలు బాదాడు. నిరుడు ఫైనలిస్ట్ అయిన సంజూ శాంసన్(Sanju Samson) సేన ఈసారి ప్లే ఆఫ్స్‌కు చేరలేకపోయింది. యంగ్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ మెరపులు మెరిపించినా కీలక ఆటగాళ్లు రాణించలేదు. దాంతో, రెండోసారి ఫైనల్ చేరాలనుకున్న ఆ జట్టు కల కలగానే మిగిలింది.
ఇవి కూడా చదవండి
VVS Laxman Son Sarvajith | క్రికెట్లో దూసుకొస్తున్న లక్ష్మణ్ వారసుడు.. హెచ్‌సీఏ డివిజన్ మ్యాచ్‌లో సెంచరీ
Ashes Series | ఇది యాషెస్.. ఎగ్జిబిషన్ మ్యాచ్ కాదు.. ఇంగ్లండ్ జట్టుపై మాజీ కెప్టెన్ విసుర్లు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aurangzeb Tomb | ఔరంగజేబు సమాధి తొలగింపునకు డెడ్‌లైన్ ఫిక్స్.. సంచలన ప్రకటన చేసిన మహారాష్ట్ర మంత్రి!
Panchayat Raj | ఆరు నెలలకో అధికారి.. పీఆర్ఆర్డీలో మూడేండ్లలో ఆరుగురు స్పెషల్ సీఎస్ల బదిలీ
Exams | విద్యార్థులకు సమ్మర్ టెన్షన్.. పరీక్షల సమయంలో కరెంట్, నీటి కష్టాలు తప్పవా?
SIR | తెలంగాణలో ఓట్ల తొలగింపు కలకలం.. 5.84 లక్షల ఫామ్-7 దరఖాస్తులు.. అసలేం జరుగుతోంది?
Alphabet Shares | రూ.45.76 లక్షల కోట్లు ఫట్… ఒక్కరోజే భారీగా కరిగిపోయిన గూగుల్ విలువ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

