VVS Laxman Son Sarvajith | క్రికెట్లో దూసుకొస్తున్న లక్ష్మణ్ వారసుడు.. హెచ్‌సీఏ డివిజన్ మ్యాచ్‌లో సెంచరీ
VVS Laxman Son Sarvajith : భారత క్రికెట్‌పై హైదరాబాదీ మాజీ సొగసరి ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman) చెరగని ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతడి వారసుడు వచ్చేస్తున్నాడు. అవును.. అతడి కుమారుడు సర్వజిత్ వీవీఎస్(Sarvajith VVS) చిన్న వయసులోనే క్రికెట్లో రాణిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. నిన్న జరిగిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్...
VVS Laxman Son Sarvajith : భారత క్రికెట్‌పై హైదరాబాదీ మాజీ సొగసరి ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman) చెరగని ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతడి వారసుడు వచ్చేస్తున్నాడు. అవును.. అతడి కుమారుడు సర్వజిత్ వీవీఎస్(Sarvajith VVS) చిన్న వయసులోనే క్రికెట్లో రాణిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. నిన్న జరిగిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association) బి డివిజన్ మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. ఎడమ చేతివాటం బ్యాటర్ అయిన సర్వజిత్ 209 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్ బాదాడు.
‘ఇది నా రెండో మ్యాచ్. ఇది నా మొదటి సెంచరీ. ఈ శతకం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే.. ? నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిన ఇన్నింగ్స్ ఇది. అంతేకాదు నేను మరింత కష్టపడేందుకు మోటివేట్ చేస్తుంది’ అని సర్వజిత్ తెలిపాడు. వంద కొట్టడం విశేషం. సింకింద్రాబాద్ నవాబ్స్(Secunderabad Nawabs) జట్టుకు ఆడుతున్నసర్వజిత్ తొలి మ్యాచ్‌లో 14 పరుగులకే ఔటయ్యాడు. రెండో మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు ఫ్యూచర్ స్టార్(Future Star) 427 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌లో మూడో స్థానంలో వచ్చిన సర్వజిత్ శతకంతో జట్టును ఆదుకున్నాడు.
వీవీఎస్ లక్ష్మణ్

ఆటకు వీడ్కోలు పలికిన లక్ష్మణ్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(National Cricket Academy) హెడ్‌గా ఉన్నాడు. దాంతో, అతడి కుటుంబమంతా అక్కడే ఉండిపోయింది. తండ్రిని స్ఫూర్తిగా తీసుకన్న సర్వజిత్ కూడా అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. అలా తన ఆటను మెరుగుపరుచుకుంటున్నాడు. సర్వజిత్ ప్రస్తుతం ఇంటర్మీడియట్ రెండో ఏడాది చదువుతున్నాడు.
ఇవి కూడా చదవండి
Ashes Series | ఇది యాషెస్.. ఎగ్జిబిషన్ మ్యాచ్ కాదు.. ఇంగ్లండ్ జట్టుపై మాజీ కెప్టెన్ విసుర్లు
Ajit Agarkar: టీమిండియా చీఫ్ సెలెక్టర్ రేసులో అజిత్ అగార్కర్ !
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Detection | వ్యక్తుల ముఖాల ఫొటోలతో క్యాన్సర్ ఉందో లేదో చెప్పేయవచ్చు.. కొత్త ఏఐని అభివృద్ధి చేసిన పరిశోధకులు..
Cyclone Arnab | ఏపీలో అర్నబ్ బీభత్సం.. పలు జిల్లాలో ఏడుగురు మృతి
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

