Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Steve Smith : టెస్టు క్రికెట్లో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ (Steve Smith) సంచలనం సృష్టించాడు. గత కొంతకాలంగా సుదీర్ఘ ఫార్మాట్లో అదరగొడుతున్న జో రూట్(Joe Root)ను స్మిత్ అధిగమించాడు.
Steve Smith : టెస్టు క్రికెట్లో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ (Steve Smith) సంచలనం సృష్టించాడు. గత కొంతకాలంగా సుదీర్ఘ ఫార్మాట్లో అదరగొడుతున్న జో రూట్(Joe Root)ను స్మిత్ అధిగమించాడు. రెడ్ బాల్ క్రికెట్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా అవతరించాడీ వెటరన్. దక్షిణాఫ్రికాతో డర్బన్ టెస్టు (Durban Test)లో బ్యాటింగ్‌లో తేలిపోయిన స్మిత్.. ఫీల్డింగ్‌లో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా నాలుగు క్యాచ్‌లు అందుకున్న ఆసీస్ స్టార్.. మొత్తంగా 224 మందిని ఔట్ చేయడం ద్వారా రూట్‌ను రెండో స్థానానికి నెట్టేశాడు.
సుదీర్ఘ ఫార్మాట్లో స్టీవ్ స్మిత్ మరో రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకూ తన క్లాస్ బ్యాటింగ్‌తో పలు ఘనతలు సాధించిన అతడు ఈసారి ఫీల్డింగ్‌లో దక్షిణాఫ్రికాతో డర్బన్ టెస్టుకు ముందు 220 క్యాచ్‌లతో జో రూట్ సరసన నిలిచిన స్మిత్.. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగుసార్లు బంతిని ఒడిసిపట్టాడు. దాంతో.. టెస్టుల్లో అత్యధిక క్యాచ్(224)లు పట్టిన ఆటగాడిగా రికార్డు లిఖించాడు.
సెకండ్ స్లిప్‌లో మెరుపు క్యాచ్‌లు పట్టడంలో ఆరితేరిన అతడు తొలి ఇన్నింగ్స్‌లో బెడింగమ్, తెంబ బవుమా, కైలీ వెర్రినే, అన్రిచ్ నోర్జిలను పెవిలియన్ పంపాడు. ప్రస్తుతం స్మిత్, రూట్ టాప్-2లో ఉండగా భారత దిగ్గజం రాహుల్ ద్రవిడ్(210) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. మహేళ జయవర్దనే(శ్రీలంక) 205 క్యాచ్‌లు, జాక్వెస్ కలిస్(దక్షిణాఫ్రికా) రెండొందల క్యాచ్‌లతో నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నారు.
With five catches in Durban, Steve Smith goes four clear of Joe Root 📈 https://t.co/VMUOhHbBJs
— Cricinfo (@cricinfo) October 13, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

