బార్సిలోనా: స్పెయిన్ టెన్నిస్ స్టార్ గార్బెన్ ముగురుజా త్వరలో తన బ్యాచిలర్ లైఫ్ ఫుల్స్టాప్ పెట్టబోతున్నది. ఫ్రెంచ్, వింబుల్డన్ మాజీ చాంపియన్ అయిన ముగురుజా తన అభిమాని ఆర్థర్ బోర్జెస్నే త్వరలో మనువాడబోతున్నది.
తామిద్దరం నిశ్చితార్థం చేసుకోబోతున్న విషయాన్ని ఆమె ఇన్స్టామ్గ్రామ్ వేదికగా ప్రకటించింది. 2021 యూఎస్ ఓపెన్ సందర్భంగా ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారిందని అంది.