FIFA World Cup 2023 | చరిత్ర సృష్టించిన స్పెయిన్.. తొలిసారి ఫైనల్ చేరిన మహిళల జట్టు
FIFA World Cup 2023 : ఫిఫా మహిళల వరల్డ్ కప్‌లో మరో సంచలనం నమోదైంది. టోర్నీ ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శన చేసిన స్పెయిన్ (Spain)మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో అడుగు పెట్టింది. ఈరోజు హోరీ హోరీగా జరిగిన సెమీఫైనల్లో స్వీడన్(Sweden)పై 2-1తో గెలుపొందింది. ఒల్గా కార్మోనా(Olga Carmona) 90వ నిమిషంలో విన్నింగ్ గోల్ కొట్టడంతో...
FIFA World Cup 2023 : ఫిఫా మహిళల వరల్డ్ కప్‌లో మరో సంచలనం నమోదైంది. టోర్నీ ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శన చేసిన స్పెయిన్ (Spain)మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో అడుగు పెట్టింది. ఈరోజు హోరీ హోరీగా జరిగిన సెమీఫైనల్లో స్వీడన్(Sweden)పై 2-1తో గెలుపొందింది. ఒల్గా కార్మోనా(Olga Carmona) 90వ నిమిషంలో విన్నింగ్ గోల్ కొట్టడంతో స్పెయిన్ డగౌట్లో సంబురాలు మొదలయ్యాయి. రేపు ఆస్ట్రేలియా, ఇంగండ్ మధ్య రెండో సెమీఫైనల్ జరుగనుంది. ఈ మ్యాచ్ విజేతతో స్పెయిన్ జట్టు టైటిల్ పోరులో తలపడనుంది.
ఈడెన్ పార్క్(Eden Park)లో ఈరోజు స్పెయిన్, స్వీడన్ జట్లు ఫైనల్ బెర్త్ కోసం పోటాపోటీగా తలపడ్డాయి. క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్‌పై మెరిసిన సల్మా పారల్లులో(Salma Paralluelo) 81 నిమిషంలో గోల్ చేయడంతో స్పెయిన్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే.. 88వ నిమిషంలో స్వీడన్ ప్లేయర్ రెబెక్కా బ్లొంక్విస్ట్(Rebecka Blomqvist) గోల్ కొట్టి స్కోర్ సమం చేసింది.
81′ 🇪🇸 1-0
88′ 🇸🇪 1-1
89′ 🇪🇸 2-1Nine minutes of mayhem! 🤯#BeyondGreatness | #FIFAWWC
— FIFA Women’s World Cup (@FIFAWWC) August 15, 2023
మ్యాచ్ సమయం దగ్గర పడడంతో పెనాల్టీ షూటౌట్ తప్పకపోవచ్చు అనుకున్నారంతా. కానీ, ఒల్గా కార్మోనా 90 నిమిషంలో గోల్ కొట్టి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. దాంతో, స్వీడన్ ప్లేయర్స్ కన్నీటిపర్యంతమయ్యారు.
ఇవి కూడా చదవండి
Virat Kohli | స్వాతంత్య్ర దినోత్సవం నాకెంతో ప్రత్యేకం.. బాల్యపు రోజుల్ని గుర్తు చేసుకున్న కోహ్లీ
Virat Kohli | జిమ్‌లో చెమటలు చిందిస్తున్న విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

