Cricket Records | డివిలియర్స్ రికార్డు బద్దలు.. 29 బంతుల్లోనే సెంచరీ
Cricket Records | ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల రికార్డు బద్దలై ఒక్క రోజు కూడా కాకముందే.. లిస్ట్-‘ఎ’ క్రికెట్లో పెను విధ్వంసం నమోదైంది. దక్షిణాఫ్రికా దేశవాళీ టోర్నీ ‘ది మార్ష్ కప్’లో భాగంగా 21 ఏండ్ల కుర్రాడు ఫ్రెజర్ మెక్‌గుర్క్ అరుదైన రికార్డు నమోదు చేసుకున్నాడు.
Cricket Records | ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల రికార్డు బద్దలై ఒక్క రోజు కూడా కాకముందే.. లిస్ట్-‘ఎ’ క్రికెట్లో పెను విధ్వంసం నమోదైంది. దక్షిణాఫ్రికా దేశవాళీ టోర్నీ ‘ది మార్ష్ కప్’లో భాగంగా 21 ఏండ్ల కుర్రాడు ఫ్రెజర్ మెక్‌గుర్క్ అరుదైన రికార్డు నమోదు చేసుకున్నాడు. కేవలం 29 బంతుల్లోనే సెంచరీ చేసి లిస్ట్-‘ఎ’ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ తన పేరిట లిఖించుకున్నాడు. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డును ఫ్రెజర్ తిరగరాశాడు. అయితే డివిలియర్స్ అంతర్జాతీయ స్థాయిలో వెస్టిండీస్‌పై (2015లో) 31 బంతుల్లో సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ పోటీల్లో ఇదే ఫాస్టెస్ట్ కాగా.. లిస్ట్-‘ఎ’లో ఫ్రెజర్ నయా రికార్డు నెలకొల్పాడు.
టాస్మానియాతో జరిగిన పోరులో సౌత్ ఆస్ట్రేలియా తరఫున బరిలోకి దిగిన ఫ్రెజర్.. తొలుత 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరింత చెలరేగిన ఈ కుర్రాడు.. మరో 11 బంతుల్లోనే మూడంకెల స్కోరు తన పేరిట లిఖించుకున్నాడు. చివరికి అతడు 38 బంతుల్లో 125 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన టాస్మానియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. జోర్డాన్ స్కిల్ (116) సెంచరీతో చెలరేగగా.. జెవెల్ (90), రైట్ (51) హాఫ్ సెంచరీలు చేశారు. అనంతరం లక్ష్యఛేదనలో ప్రెజర్ (38 బంతుల్లో 125; 10 ఫోర్లు, 13 సిక్సర్లు) దంచికొట్టినా.. దక్షిణ ఆస్ట్రేలియా చివరకు 46.4 ఓవర్లలో 398 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా టాస్మానియా 37 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్‌లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

