Soudi Super Cup | రెండో మ్యాచ్‌లోనూ గోల్ కొట్టని రొనాల్డో.. సౌదీ సూపర్ కప్ నుంచి నస్రీ క్లబ్ ఔట్
స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో కీలకమైన సెమీఫైనల్లో నస్రీ క్లబ్‌ను నిరాశ పరిచాడు. రియాద్‌లో జరిగిన సెమీఫైనల్లో అల్ ఇత్తిహద్ జట్టు 3-1తో నస్రీ జట్టును చిత్తు చేసింది. సౌదీ సూపర్ కప్ నుంచి నస్రీ క్లబ్ నిష్క్రమించింది.
Soudi Super Cup : స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో మరోసారి నిరాశ పరిచాడు. అతడిపై ఎన్నో ఆశలు పెట్టకున్న నస్రీ క్లబ్‌ను కీలకమైన మ్యాచ్‌లో గెలిపించలేకపోయాడు. రియాద్‌లో జరిగిన సెమీఫైనల్లో అల్ ఇత్తిహద్ జట్టు 3-1తో నస్రీ జట్టును చిత్తు చేసింది. దాంతో సౌదీ సూపర్ కప్ నుంచి నస్రీ క్లబ్ నిష్క్రమించింది. తొలి అర్థభాగంలోనే ఆ క్లబ్ రెండు గోల్స్ కొట్టి అల్ నస్రీని ఒత్తిడిలోకి నెట్టింది. రోమరిన్హో, అబ్బెర్రజాక్ హమదల్లాహ్ చెరొక గోల్ కొట్టారు. నస్రీ క్లబ్ ఆటగాడు అండర్సన్ తలిస్కా 67వ నిమిషంలో గోల్ చేసి ఆశలు రేపాడు. కానీ, స్టార్ స్ట్రయికర్ రొనాల్డో ఒక్క గోల్ కూడా చేయలేదు. రెండుసార్లు గోల్ చేసే అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోలేదు. అల్ ఇత్తేహద్ డిఫెండర్లు రొనాల్డోను నిలువరించడంలో సక్సెస్ అయ్యారు.
అల్ నస్రీ క్లబ్ తరఫున రొనాల్డోకు ఇది రెండో మ్యాచ్. మైదానంలో చిరుతలా కదిలే అతను రెండు మ్యాచుల్లోనే ఒక్క గోల్ కూడా చేయకపోయాడు. తమక్లబ్ రాత మారుస్తాడని రొనాల్డోతో అల్ నస్రీ క్లబ్ రూ.4400 కోట్ల భారీ ధరకు ఒప్పందం చేసుకుంది. కానీ అతను తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. దాంతో, అల్ నస్రీ క్లబ్ యాజమాన్యం, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

