NZ vs ENG : నాటింగ్హమ్ టెస్టులో ఇంగ్లండ్(England) పట్టుబిగించే అవకాశాన్ని కోల్పోయింది. ఓపెనర్ బెన్ డకెట్(113) శతకంతో భారీ స్కోర్‌కు బాటలు వేసినా న్యూజిలాండ్ పేసర్లు నాథన్ స్మిత్(4-91), జకారీ ఫౌల్క్స్(3-35) లు నిప్పులు చెరగడంతో మిడిలార్డర్ బ్యాటర్లు నిరాశపరిచారు. విలియం ఓ రూర్కీ(3-53) ధాటికి తొలి సెషన్లోనే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టు.. తొలి ఇన్నింగ్స్‌లో 354కే ఆలౌటైంది. కివీస్‌కు 84 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
స్వదేశంలో టెస్టు సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడిన ఇంగ్లండ్ శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. సిరీస్ విజేతను నిర్ణయించే మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు భారీ స్కోర్ చేయకుండా న్యూజిలాండ్ బౌలర్లు అడ్డుకున్నారు. బజ్‌బాల్ ఆటతో అలరించిన ఓపెనర్ బెన్ డకెట్(113) శతకంతో.. జాకబ్ బెథెల్(74) అర్ధ శతకంతో భయపెట్టినా.. నాథన్ స్మిత్(4-91), జకారీ ఫౌల్క్స్(3-35), విలియం ఓ రూర్కీ(3-53)లు వికెట్ల వేటతో రెచ్చిపోయారు.
📍 Trent Bridge
England are bowled out for 354 after resuming the day on 223-2, with Nathan Smith leading New Zealand’s bowling effort with four wickets. Zak Foulkes and Will O’Rourke chipped in with three apiece as the visitors took a first-innings lead of 84 into tea break on… pic.twitter.com/ZLJPKBRMIz
— Cricinfo (@cricinfo) June 27, 2026
తొలి సెషన్లోనే రూర్కీ, స్మిత్ రెచ్చిపోయి నాలుగు వికెట్లు తీసి ఆతిథ్య జట్టుకు షాకిచ్చారు. ఓవైపు వికెట్లు పడుతున్నా టెయిలెండర్ల సాయంతో హ్యారీ బ్రూక్(58) భాగస్వామ్యాలు నిర్మించాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్(15) విఫలమవ్వగా.. అట్కిన్సన్(23) బ్యాట్ ఝులిపంచాడు. జోష్ టంగ్(2)ను ఫౌల్క్స్ ఔట్ చేయడంతో 354 వద్ద ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టీ బ్రేక్ అనంతరం లాథమ్ సేన రెండో ఇన్నింగ్స్ ఆరంభించనుంది. తొలుత టామ్ లాథమ్(151), డెవాన్ కాన్వే(157)ల శతకాలో న్యూజిలాండ్ 438 పరుగులు చేసింది.