SRH vs PBKS : ముల్లన్‌పూర్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ల విధ్వంసానికి కుదేలైన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది. ఆకాశమే హద్దుగా బౌండరీలే లక్ష్యంగా చెలరేగిన ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(57)ను ఔట్ చేసిన శివాంగ్ కుమార్(2-17) తొలి వికెట్ అందించాడు. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో గుబులు రేపిన ప్రియాన్ష్ భారీ షాట్‌కు యత్నించగా.. నితీశ్ రెడ్డి క్యాచ్ అందుకోగా అతడి మెరుపులకు తెరపడింది. కాసేపటికే ప్రభ్‌సిమ్రన్‌ను సైతం అతడు వెనక్కి పంపి పంజాబ్‌కు షాకిచ్చాడు.
భారీ స్కోర్ కొట్టినా సరే పసలేని బౌలింగ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను వేధిస్తోంది. ముల్లన్‌పూర్‌లో పంజాబ్ కింగ్స్‌కు 220 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిచంఇన ఆరెంజ్ ఆర్మీ.. పవర్ ప్లేలోనే దండిగా రన్స్ ఇచ్చుకుంది. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్(51), ప్రియాన్ష్ ఆర్య(57)లు ప్రతి బంతికి ఫోర్, సిక్స్ అన్నట్టుగా చెలరేగడంతో హైదరాబాద్ బౌలర్లు చేష్టులుడిగిపోయారు.
Another opening pair setting the stage alight 🔥
🎥 Prabhsimran Singh and Priyansh Arya with some sizzling ball-striking ⚡️
Updates ▶️ https://t.co/DUNkQi9YaV#TATAIPL | #KhelBindaas | #PBKSvSRH | @PunjabKingsIPL pic.twitter.com/ONHNgpr36i
— IndianPremierLeague (@IPL) April 11, 2026
ఎట్టకేలకు ఈ ప్రమాదకరమైన ద్వయాన్ని శివాంగ్ కుమార్(2-17) విడదీశాడు. 16 బంతుల్లోనే అర్ధ శతకం బాదేసిన ప్రియాన్ష్‌ను బౌండరీ క్యాచ్‌తో వెనక్కి పంపాడు. దాంతో.. 99 వద్ద పంజాబ్ తొలి వికెట్ పడింది. కాసేపటికే శివాంగ్ ఓవర్లోనే మిడాఫ్‌లో సిక్సర్‌తో అర్ధ శతకం సాధించిన ప్రభ్‌సిమ్రన్ బౌండరీ వద్ద క్లాసెన్ చేతికి దొరికాడు. దాంతో.. 117 వద్ద రెండో వికెట్ కోల్పోయింది పంజాబ్.
.