ప్రిక్వార్టర్స్లోసెరెనా

- నాదల్ ముందంజ ఫ్రెంచ్ ఓపెన్
అచ్చొచ్చిన కోర్టులో స్పెయిన్ బుల్ నాదల్ విజృంభిస్తుంటే.. చాన్నాళ్లుగా ఊరిస్తున్న మార్గరెట్ కోర్ట్ రికార్డును సమం చేయాలని అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ తహతహలాడుతున్నది. ఫ్రెంచ్ ఓపెన్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాదల్ మూడో రౌండ్‌కు చేరితే.. మహిళల విభాగంలో సెరెనా ప్రిక్వార్టర్స్‌లో అడుగు పెట్టింది.
పారిస్: టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు చేజిక్కించుకున్న మార్గరెట్ కోర్ట్ (24 టైటిల్స్) రికార్డును సమం చేయాలని ఉవ్విళ్లూరుతున్న అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ ఆ దిశగా మరో ముందడుగు వేసింది. కరోనా కష్టకాలంలో సాగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో సెరెనా 6-4, 6-4తో తన దేశానికే చెందిన కొలిన్స్‌ను చిత్తు చేసి ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. గంటా 25 నిమిషాల పాటు సాగిన పోరులో సెరెనా ఐదు ఏస్‌లు సంధించి.. 22 విన్నర్లు కొట్టగా.. కొలిన్ 21 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. సెరెనా 190 కిలోమీటర్ల వేగంతో సంధించిన సర్వీసులకు బదులు చెప్పలేకపోయిన కొలిన్ వరుస సెట్లలో ఓటమి మూటగట్టుకుంది. ప్రిక్వార్టర్స్‌లో రష్యాకు చెందిన రైబాకినాతో సెరెనా తలపడనుంది. ఇతర మ్యాచ్‌ల్లో విక్టోరియా అజరెంకా (బెలారస్) 6-2, 6-2తో మాడిసన్ కీస్ (అమెరికా)పై విజయం సాధించగా.. మూడో సీడ్ సబలెంకా (బెలారస్) 4-6, 6-2, 0-6తో అనస్తీసియా పవ్లుచెంకోవా (రష్యా) చేతిలో ఓటమి పాలైంది.
నాలుగో రౌండ్లో నిషికోరి
టాప్ త్రి ఆటగాళ్లు నాదల్ (స్పెయిన్), జొకోవిచ్ (సెర్బియా), ఫెదరర్ (స్విట్జర్లాండ్) ఒకే పార్శంలో ఉండటంతో రెండో వైపు నుంచి యువ ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. జపాన్ యంగ్ గన్ నిషికోరి, జర్మనీ యువ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ నాలుగో రౌండ్ (ప్రిక్వార్టర్స్)లో అడుగు పెట్టారు. ఫిన్లాండ్ ఆటగాడు లాక్సోనెన్తో జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో నిషికోరికి వాకొవర్ లభించగా.. లాస్లో డెరే (సెర్బియా)తో పోరులో ఆరో సీడ్ జ్వెరెవ్ 6-2, 7-5, 6-2తో విజయం సాధించాడు. రెండో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) మూడో రౌండ్లో 6-4, 6-2, 6-4తో ఒపెల్కా (అమెరికా)ను ఓడించి ప్రిక్వార్టర్స్‌కు చేరాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో మూడో సీడ్, హాట్ ఫెవరెట్ రఫేల్ నాదల్ 6-0, 7-5, 6-2తో గాస్కెట్ (ఫ్రాన్స్)పై నెగ్గి ముందడుగు వేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

