దుబాయ్: న్యూజిల్యాండ్ ఓపెనర్ గప్తిల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. స్కాట్లాండ్తో జరుగుతున్న మ్యాచ్‌లో జట్టును నిలబెట్టిన అతను భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాన్‌లో మెక్లాయిడ్కు క్యాచ్ ఇచ్చాడు. 19వ ఓవర్ వేసిన స్కాట్లాండ్ బౌలర్ బ్రాడ్ వీల్.. వరుస బంతుల్లో గ్లెన్ ఫిలిప్స్ (33), మార్టిన్ గప్తిల్ (93)ను పెవిలియన్ చేర్చాడు.
దీంతో స్కాట్లాండ్ జట్టు మళ్లీ పోటీలోకి వచ్చింది. న్యూజిల్యాడ్ బ్యాట్స్మెన్లలో డారియల్ మిచెల్ (13), కేన్ విలియమ్సన్ (0), డెవాన్ కాన్వే (1) విఫలమయ్యారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి న్యూజిల్యాండ్ జట్టు 172/5 స్కోరు సాధించింది.
అంటే గెలుపు కోసం నిర్ణీత 20 ఓవర్లలో స్కాట్లాండ్ జట్టు 173 పరుగులు చేయాలి. స్కాట్లాండ్ బౌలర్లలో బ్రాడ్ వీల్ 2, సఫ్యాన్ షరీఫ్ 2 వికెట్లు పడగొట్టగా, మార్క్ వ్యాట్ ఒక వికెట్ తీశాడు.