BCCI – SBI Life | బీసీసీఐ అధికారిక స్పాన్సర్‌గా ఎస్బీఐ లైఫ్.. టీమిండియా ఒక్కో మ్యాచ్‌కు రూ. 85 లక్షలు ఇవ్వనుంది
BCCI - SBI Life : భారత క్రికెట్ బోర్డు(BCCI) భారీగా ఆదాయం సమకూర్చుకోవడంపై కన్నేసింది. ఈమధ్యే ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్(IDFC first Bank)కు టైటిల్ స్పాన్సర్ హక్కులను అప్పజెప్పిన బీసీసీఐ తాజాగా అధికారిక స్పాన్సర్(Official Sponser)గా..
BCCI – SBI Life : భారత క్రికెట్ బోర్డు(BCCI) భారీగా ఆదాయం సమకూర్చుకోవడంపై కన్నేసింది. ఈమధ్యే ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్(IDFC first Bank)కు టైటిల్ స్పాన్సర్ హక్కులను అప్పజెప్పిన బీసీసీఐ తాజాగా అధికారిక స్పాన్సర్(Official Sponser)గా ఎస్బీఐ లైఫ్(SBI Life)కి హక్కులు కట్టబెట్టింది. మూడేళ్ల కాలాని (2023 – 2026)కి బీసీసీఐ, ఎస్బీఐ లైఫ్ మధ్య రూ.47 కోట్ల ఒప్పందం కుదిరింది. భారత జట్టు ఆడబోయే దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచులకు ఈ ఇన్షూరెన్స్ కంపెనీ అధికారిక స్పాన్సర్‌గా వ్యవహరించనుంది.
ఇకనుంచి టీమిండియా ఆడే ఒక్కో మ్యాచ్‌కు రూ.85 లక్షలు బీసీసీఐకి ముట్టజెప్పనుంది. ఈ విషయాన్ని సెక్రటరీ జై షా() వెల్లడించాడు. బీసీసీఐ అధికారిక స్పాన్సర్‌గా ఎంపికైన ఎస్బీఐ లైఫ్‌కు స్వాగతం. ఈ మూడేళ్లలో వరల్డ్ కప్‌తో పాటు వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ టోర్నీల్లో టీమిండియా అఫీషియల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది అని జై షా ఓ ప్రకటనలో తెలిపాడు. ఈ మూడేళ్ల కాలంలో భారత జట్టు 56 మ్యాచ్‌లు ఆడనుంది.
మూడు ఫార్మాట్లలో నంబర్ 1
భారత్, ఆస్ట్రేలియా మధ్య మొహాలీ స్టేడియం(Mohali Stadium)లో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌తో బీసీసీఐ అధికారిక స్పాన్సర్‌గా ఎస్బీఐ లైఫ్ ప్రయాణం మొదలైంది. ఈ మ్యాచ్‌లో ఇండియా 5 వికెట్లతో ఆసీస్(Australia)పై థ్రిల్లింగ్ విజయం సాధించింది.

కెప్టెన్ రాహుల్(56 నాటౌట్), ఆసీస్‌పై వరుసగా మూడుసార్లు గోల్డెన్ డక్ అయిన సూర్యకుమార్ యాదవ్(50) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలుపు వాకిట నిలిపారు.దాంతో, మూడు ఫార్మాట్లలో నంబర్ 1 జట్టుగా అవతరించింది.
ఇవి కూడా చదవండి
ODI World Cup 2023 | నెదర్లాండ్స్ జట్టు వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. స్పెషల్ ఏముందంటే..?
Former Cricketers | కాశీ విశ్వనాథుని దర్శించుకున్న మాజీ క్రికెటర్లు.. Video
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

