Sarabjot Singh | అరగంట ప్రాక్టీస్.. కంచు మోత మోగించాం
Sarabjot Singh : పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యంతో చరిత్ర సృష్టించిన సరభ్‌జోత్ సింగ్ (Sarabjot Singh) ఫైనల్ పోరు సన్నద్ధతమైన తీరును వివరించాడు. ఒలింపిక్స్‌లో స్వర్ణం కొల్లగొట్టిన టర్కీ షూటర్ యూసుఫ్ డికెక్ (Yusuf Dikec) తన ఫేవరెట్ అని సరభ్‌జోత్ చెప్పాడు.
Sarabjot Singh : పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యంతో చరిత్ర సృష్టించిన సరభ్‌జోత్ సింగ్ (Sarabjot Singh) షూటింగ్లో మరిన్ని అద్బుతాలు చేస్తానంటున్నాడు. అందుకోసం ప్రభుత్వం ఆఫర్ చేసిన ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాడు. షూటింగ్ మీదే ఫోకస్ పెట్టిన సరభ్‌జోత్ తాజాగా ఒలింపిక్ ఫైనల్ పోరు సన్నద్ధతమైన తీరును వివరించాడు.
’10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ విభాగం కోసం మను, నేను 30 నిమిషాలు మాత్రమే సాధన చేశాం. అయినా సరే గురి తప్పకుండా కాంస్యం గెలుపొందాం’ అని ఈ యువ షూటర్ తెలిపాడు. ’10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో నేను 9 గంటలకు ప్రాక్టీస్ చేసేవాడిని. మను 12 గంటలకు సాధన చేసేది. అయితే.. మిక్స్డ్ టీమ్ ఈవెంట్ కోసం ఇద్దరం అరగంట మాత్రమే సాధన చేశాం. అప్పుడు మా ఇద్దరి మధ్య సంభాషణ చాలా తక్కువ.

మనం వంద శాతం మన బెస్ట్ ఇవ్వాలని మాట్లాడుకునేవాళ్లం. సరదాగా జోక్‌లు కూడా వేసుకునేవాళ్లం. ఒకసారి నేను మనుపై జోక్ వేస్తే.. ఆ తర్వాత ఆమె నన్ను ఆటపట్టించేది’ అని సరభ్‌జోత్ వెల్లడించాడు. అంతేకాదు ఒలింపిక్స్‌లో స్వర్ణం కొల్లగొట్టిన టర్కీ షూటర్ యూసుఫ్ డికెక్ (Yusuf Dikec) తన ఫేవరెట్ అని సరభ్‌జోత్ చెప్పాడు.
ఏం తింటున్నాడో అడుగుతా?
నేను 2011 నుంచి యూసుఫ్ షూటింగ్ వీడియోలు చూస్తున్నా. అప్పటికీ ఇప్పటికీ అతడి గురిలో ఏమాత్రం తేడా లేదు. ప్రస్తుతం అతడికి 51 ఏండ్లు. నేను ఎంత ప్రయత్నించినా కూడా యూసుఫ్ ప్రదర్శనకు పోటీకాను. ఒకవేళ నాకు అవకాశం దొరికితే అతడు ఏం తింటున్నాడో అడుగుతా అని 22 ఏండ్ల సరభ్‌జోత్ అన్నాడు.
ఇవి కూడా చదవండి
- Mallikarjun Kharge | మైనారీటీలను లక్ష్యంగా చేసుకోవడం, బుల్డోజర్లను ఉపయోగించడం ఆందోళనకరం: మల్లికార్జున్ ఖర్గే
- Paravada incident | పరవాడ ఘటనలో చికిత్సపొందుతూ కార్మికుడు మృతి
- KTR | బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డికి కేటీఆర్ పరామర్శ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

