బ్యాట్‌తో బరిలోకి సచిన్.. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ షెడ్యూల్ ఇదే..!
Road Safety World Series | రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ తిరిగి రానున్నది. గతేడాది నిర్వహించిన ఈ టోర్నీ భారీ విజయాన్ని అందుకున్నది. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత బ్యాట్ పట్టుకున్న అభిమాన క్రికెటర్లను చూసేందుకు పెద్ద సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు. వరల్డ్ సిరీస్ ఇంతకు ముందు ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో జరిగింది. తాజాగా ఏడాది షెడ్యూల్‌ను నిర్వాహకులు ప్రకటించారు. సెప్టెంబర్ 10 నుంచి 22 రోజుల పాటు సిరీస్ కొనసాగనున్నది. కాన్పూర్‌లో జరిగే మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభంకానున్నది. అయితే, ఈ సారి దేశంలోని మరో రెండు స్టేడియాల్లో మ్యాచులు జరుగనుండగా.. సెమీ ఫైనల్, ఫైనల్ రెండూ రాయ్‌పూర్ మైదానంలోనే జరుగనున్నాయి. ఇండోర్, డెహ్రాడూన్‌లోనూ మ్యాచ్‌లు జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.
ఇండియా లెజెండ్స్‌కు కెప్టెన్‌గా సచిన్..
ఈ ఏడాది ఎనిమిది జట్లు పాల్గొనుండగా.. ఇందులో భారత్, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, శ్రీలంక, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ జట్లు తలపడనుండగా.. ఈ టోర్నీలో కేవలం రిటైర్డ్ క్రికెట్లరు మాత్రమే పాల్గొననున్నారు. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా రహదారి భద్రత గురించి అవగాహన కల్పించే లక్ష్యంతోనే రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ నిర్వహిస్తున్నారు. దీనికి రవాణా, సమాచార, ప్రసార, క్రీడల మంత్రిత్వశాఖలు సహకారం అందించనున్నాయి. సిరీస్‌లో బ్రియాన్ లారా, తిలకరత్నే దిల్షాన్, షేన్ వాట్సన్, రాస్ టేలర్ వంటి వెటరన్ క్రికెటర్లు టోర్నీలో పాల్గొనున్నారు. 2021లో జరిగిన వరల్డ్ సిరీస్‌ను సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్ జట్టు గెలుచుకున్నది. ఫైనల్లో భారత్ 14 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఇండియా లెజెండ్స్ ఈ సారి సైతం సచిన్ టెండూల్కర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
సిరీస్‌పై కేంద్రమంత్రి ఏమన్నారంటే..
రోడ్ సేఫ్టీ సిరీస్‌పై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ క్రికెట్ ద్వారా ప్రజలకు రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ చాలా మంచి కార్యక్రమన్నారు. రహదారికి సంబంధించిన అన్ని నియమాలు, మార్గదర్శకాలను ప్రతి వ్యక్తి తెలుసుకోవడంతో పాటు పాటించాలని తాము కోరుకుంటున్నామన్నారు. ఇందులో ఈ సిరీస్ కీలక పాత్ర పోషిస్తుందని తాను నమ్ముతున్నానని, అదే సమయంలో, క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ సామాజిక మార్పులో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తాను విశ్వసిస్తున్నానన్నారు. ట్రాఫిక్ నియమాలు, భద్రతపై ప్రజల దృక్పథాన్ని మార్చేందుకు సిరీస్ ఆదర్శవంతమైన వేదికగా నిరూపితమవుతుందన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

