Cricket News : నా కెరియర్లో సచిన్‌లో చూసిన బలహీనత అదే.. దిగ్గజ స్పిన్నర్ వ్యాఖ్యలు..
Cricket News | భారత దిగ్గజ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గుర్తించి శ్రీలంక లిజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సచిన్ చాలా గొప్ప బ్యాట్స్‌మెన్ అంటూనే ఆటలో ఆయన లోపాలను ఎత్తిచూపారు.

న్యూఢిల్లీ : భారత దిగ్గజ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గుర్తించి శ్రీలంక లిజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సచిన్ చాలా గొప్ప బ్యాట్స్‌మెన్ అంటూనే ఆటలో ఆయన లోపాలను ఎత్తిచూపారు. తన కెరియర్లో సచిన్‌లో బ్యాటింగ్‌లో ఓ బలహీనతను గమనించానని, లిటిల్ మాస్టర్ ఆఫ్ స్పిన్‌ను ఎదుర్కోవడంలో కాస్త ఇబ్బంది పడతారని అభిప్రాయపడ్డారు. ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మురళీధరన్ సచిన్ బ్యాటింగ్ శైలి గుర్తించి పలు విషయాలు చెప్పుకొచ్చారు. ‘సచిన్‌కు బౌలింగ్ చేయడంలో పెద్దగా భయపడాల్సిన పని లేదు. అతను చాలా జాగ్రత్తగా వికెట్‌ను కాపాడుకుంటాడు. బంతిని అంచనా వేసి ఆడటంలో దిట్ట. నా కెరియర్లో సచిన్ బ్యాటింగ్‌లో ఓ చిన్నలోపం గుర్తించా. లెగ్‌స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే సచిన్.. ఆఫ్‌స్పిన్ విషయంలో కాస్త బలహీనుడు. చాలామంది ఆఫ్ స్పిన్నర్లు ఈ విషయాన్ని రుజువు చేశారు. సచిన్ నాకు కూడా చాలాసార్లు వికెట్ సమర్పించాడు. ఈ విషయాన్ని నేనెప్పుడు సచిన్ వద్ద ప్రస్తావించ లేదు. బహుశా ఆయనకు ఆఫ్‌స్పిన్ ఆడటంలో కాస్త బలహీనత ఉందని నా అభిప్రాయం. సచిన్ చాలా క్లిష్టమైన ఆటగాడు. అతడిని అవుట్ చేయడం చాలాకష్టం’ అని మురళీధరన్ అన్నారు. ఆస్ట్రేలియా ఫాస్ట్‌బౌలర్ బ్రెట్‌లీ తరువాత అత్యధిక సార్లు సచిన్‌ను అవుట్ చేసిన ఘనత మురళీధరన్దే. టెస్టుల్లో 800 వికెట్లు, వన్డేల్లో 530కిపైగా మురళీధరన్ పడగొట్టాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyber Attack | సైబర్ ‘సెక్యూరిటీ’ ఏది?.. రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లపై యథేచ్ఛగా దాడులు
పాడి, కోళ్ల పరిశ్రమపై కరువు పంజా.. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ స్పెషల్ ఇంటర్వ్యూ
Stock Market Tips | స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి
Israel Elections | నెతన్యాహు భవితవ్యం ఏంటో.. రేపే ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికలు
CISF | రోజుకు 14-16 గంటల పని.. నాలుగు గంటలే నిద్ర.. ఇదీ సీఐఎస్ఎఫ్ జవాన్ల దుస్థితి
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

