US Open: యూఎస్ ఓపెన్ మహిళల ఫైనల్లో.. రిబకినా వర్సెస్ సబలెంకా
US Open: యూఎస్ ఓపెన్ మహిళల ఫైనల్లో ఇద్దరు టాప్ సీడ్లు తలపడనున్నారు. ఎలినా రిబకినా, అరినా సబలెంకా మధ్య శనివారం ఆ మ్యాచ్ జరగనున్నది. ఆ ఇద్దరూ సెమీస్‌లో తమ ప్రత్యర్థుల్ని ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లారు.
న్యూయార్క్: యూఎస్ ఓపెన్( US Open) టెన్నిస్ మహిళల సింగిల్స్ ఫైనల్లోకి ఎలినా రిబకినా ప్రవేశించింది. కోకో గాఫ్‌తో జరిగిన సెమీస్‌లో రిబకినా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఇక శనివారం జరిగే ఫైనల్లో టాప్ సీడ్ అరినా సబలెంకాతో ఆమె తలపడనున్నది. ఫైనల్లో ఇద్దరు టాప్ సీడ్లు పోటీపడడం మ్యాచ్‌లో ఉత్కంఠ రేపనున్నది. 99 వారాల నుంచి సబలెంకా వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్‌లో కొనసాగుతున్నది. రెండో ర్యాంక్‌లో ఉన్న కజకిస్థాన్ ప్లేయర్ రిబకినా.. ఫైనల్లో తన సత్తా ప్రదర్శిస్తేనే టాప్ ర్యాంక్ ఆమె సాధ్యమవుతుంది. సబలెంకా వరుసగా మూడోసారి యూఎస్ ఓపెన్ మహిళల టైటిల్‌పై కన్నేసింది. హ్యాట్రిక్‌పై కన్నేసిన సబలెంకా సెమీస్‌లో 7-5 6-2 స్కోరుతో అమెరికన్ ప్లేయర్ జెస్సికా పెగులాపై గెలుపొందింది. మరో వైపు రిబకినా సెమీస్‌లో 3-6 6-4 6-4 స్కోరుతో గాఫ్‌పై విజయం సాధఙంచింది. అయితే ఇద్దరు టాప్ సీడ్లు ఫైనల్లోకి ప్రవేశించడం ఆసక్తి పెంచుతోంది. 2013 తర్వాత యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఇద్దరు టాప్ సీడ్లు పోటీపడడం మొదటిసారి అవుతంది. 2013లో సెరీనా విలియమ్స్, విక్టోరియా అజరెంకా ఫైనల్లో తలపడ్డారు.
Elena Rybakina books her ticket into her first US Open final! pic.twitter.com/HBDTVBi16U
— US Open Tennis (@usopen) September 11, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

