రజతమే బంగారమాయె

- ఫైనల్లో రష్యా చేతిలో భారత్ ఓటమి
- మహిళల చెస్ ప్రపంచ చాంపియన్‌షిప్
సిట్జెస్(స్పెయిన్): భారత మహిళల చెస్ జట్టు చరిత్ర సృష్టించింది. అంచనాల్లేకుండానే బరిలోకి దిగి అద్భుతం చేసింది. ఫిడే మహిళల ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్ వెండి వెలుగులు పూయించింది. శనివారం రష్యాతో జరిగిన ఫైనల్లో ఓడిన భారత్..మెగా టోర్నీని ద్వితీయ స్థానంతో ముగించింది. చెస్ దిగ్గజం, తెలుగు స్టార్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి లేకుండానే బరిలోకి దిగిన భారత్ అంచనాలకు మించి రాణించింది. టోర్నీ ఆసాంతం నిలకడైన ప్రదర్శన కనబరిచిన మన అమ్మాయిలు..తుది పోరులో రష్యాకు దీటైన పోటీనివ్వలేకపోయారు. తొలి మ్యాచ్‌లో 2.5-1.5 తేడాతో టీమ్ఇండియాను ఓడించిన రష్యా..అదే జోరులో రెండో మ్యాచ్‌లో 3-1తో గెలిచి పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఫైనల్ తొలి మ్యాచ్‌లో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 47 ఎత్తుల్లో అలెగ్జాండ్రా గోరియచ్కినాపై గెలిచి శుభారంభం చేసింది. కానీ వైశాలి, భక్తి కులకర్ణి తమ ప్రత్యర్థుల చేతుల్లో ఓడటం భారత్ విజయావకాశాలను దెబ్బతీసింది. నాలుగో బోర్డులో అలినాతో గేమ్‌ను మేరిఆన్గోమ్స్ డ్రా చేసుకోవడంతో పాయింట్ తేడాతో రష్యా గెలిచింది. పసిడి పోరులో నిలువాలంటే తప్పక గెలువాల్సిన రెండో ఫైనల్లో గొరియచ్కినాతో గేమ్‌ను హారిక, కొస్తెనియుక్ గేమ్‌ను వైశాలి డ్రా చేసుకుంది. సెమీస్‌లో కీలక విజయంతో జట్టును ఆదుకున్న తానియా సచ్దేవ్ మరోమారు ఆ స్థాయి ప్రదర్శన కనబరుచలేకపోయింది. భక్తి స్థానంలో పోటీ పడ్డ తానియా..ఓడిపోవడంతో భారత్ ఓటమి ఖరారైంది. చివరి గేమ్‌లో మేరీఅన్ పరాజయం ఎదుర్కొవడంతో భారత్ రజతానికి పరిమితం కావాల్సి వచ్చింది. 2007లో మొదలై రెండేండ్లకోసారి జరుగుతున్న ఈ మెగాటోర్నీలో భారత జట్టు తొలిసారి పతకం గెలిచి సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

