Jos Buttler: జోస్ బట్లర్‌కు జరిమానా.. మ్యాచ్ ఫీజులో కోత
Jos Buttler: జోస్ బట్లర్‌కు మ్యాచ్ ఫీజులో 10 శాతం ఫైన్ విధించారు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో అతను ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు.
కోల్‌కతా: రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్(Jos Buttler)కు మ్యాచ్ ఫీజులో 10 శాతం ఫైన్ విధించారు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో అతను ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు. యశస్వి జైస్వాల్‌తో ఓపెనింగ్‌కు వచ్చిన బట్లర్ ఆరంభంలోనే రనౌట్ అయ్యాడు. ఇంగ్లండ్ బ్యాటర్ వద్దు అంటూ చేయితో సంకేతం ఇస్తున్నా.. నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న జైస్వాల్ అలాగే పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఇక దిక్కుతోచని స్థితిలో బట్లర్ రన్ కోసం ఉరికాడు. కానీ రనౌట్ కావాల్సి వచ్చింది. ఆ సమయంలో బట్లర్ ఆగ్రహానికి గురయ్యాడు. ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 బట్లర్ ఉల్లంగించినట్లు ఐపీఎల్ పేర్కొన్నది. మ్యాచ్ రిఫరీ ప్రకారం అతనికి శిక్ష పడింది. దీంతో ఫీజులో 10 శాతం కోత విధించారు.
ఈ మ్యాచ్‌లో తొలుత కేకేఆర్ 8 వికెట్ల నష్టానికి 149 రన్స్ చేసింది. అయితే ఆ టార్గెట్‌ను కేవలం 13.1 ఓవర్లలోనే రాజస్థాన్ అందుకున్నది. ఆర్ఆర్ బ్యాటర్ జైస్వాల్ వీరబాదుడు బాదాడు. అతను కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఆర్ఆర్ కు భారీ విజయాన్ని కట్టబెట్టాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

