Australian Open | రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో బోపన్న జోడీ.. చరిత్ర తిరగరాస్తారా..?
Australian Open : ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియా ఓపెన్(Australian Open)లో భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న(Rohan Bopanna) మరో ఫీట్ సాధించాడు. డబుల్స్‌లో వరల్డ్ నంబర్ 1 ర్యాంక్ దక్కిన మరునాడే సంచలన విజయం ఖాతాలో వేసుకున్నాడు. గురువారం జరిగిన పురుషుల డబుల్స్...
Australian Open : ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియా ఓపెన్(Australian Open)లో భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న (Rohan Bopanna) మరో ఫీట్ సాధించాడు. డబుల్స్‌లో వరల్డ్ నంబర్ 1 ర్యాంక్ దక్కిన మరునాడే సంచలన విజయం ఖాతాలో వేసుకున్నాడు. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో థామస్ మచాక్(Tomas Machac), ఝాంగ్ జిజినె( Zhang Zhizhen) ద్వయాన్ని బోపన్న, మాథ్యూ ఎబ్బెన్(Matthew Ebden) జోడీ చిత్తు చేసింది.
తొలి సెట్ నుంచి దూకుడుగా ఆడిన బోపన్న, ఎబ్డెన్ జంట 6-3 3-6 7-6 (10-7)తో థామస్, ఝాంగ్ జోడీని మట్టికరిపించి.. తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ జంటకు వరుసగా ఇది రెండో టైటిల్ పోరు కావడం విశేషం. నిరుడు యూఎస్ ఓపెన్ ఫైనల్లో బోపన్న, మాథ్యూ జోడీ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. దాంతో, ఈ స్టార్ జోడీ ఈసారి టైటిల్ కొల్లగొట్టి చరిత్ర తిరగరాయాలనే కసితో ఉంది.
💥 @rohanbopanna@bondisands • #staycoolunderpressure • #bondisands @wwos • @espn • @eurosport • @wowowtennis pic.twitter.com/BAJwKDv0ZZ
— #AusOpen (@AustralianOpen) January 25, 2024
రెండో సీడ్‌గా టోర్నీలో అడుగుపెట్టిన బోపన్న, ఎబ్దన్ జోడీ తొలి రౌండ్ నుంచి చాంపియన్ ఆటతో రఫ్ఫాడించింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో బోపన్న, మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ 6-4, 7-6(7/5) తేడాతో మాక్సిమో గోంజాలెజ్, అండ్రెస్ మోల్టెని(అర్జెంటీనా) ద్వయంపై గెలిచి సెమీస్ చేరింది.
ఇవి కూడా చదవండి
- IND vs ENG | క్రీజులో కుదురుకున్న రూట్, బెయిర్‌స్టో.. లంచ్ సమయానికి స్కోర్..
- Rahul Gandhi | అస్సాంలో రాహుల్ గాంధీపై నమోదైన కేసు సీఐడీకి బదిలీ
- Rathnam Movie | రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న విశాల్ ‘రత్నం’
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

