World Cup 2023 | కొట్టమన్నది వికెట్లను.. బౌలర్‌ను కాదు.. పాక్ పేలవ ఫీల్డింగ్!
World Cup 2023 | వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య పోరులో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్, బ్యాటింగ్ ఎలా ఉన్నా.. ఫీల్డింగ్‌లో మాత్రం పాకిస్థాన్ జట్టు ఎప్పుడూ అత్యుత్తమ ప్రమాణాలు కనబర్చలేదనేది వాస్తవం.. కానీ
World Cup 2023 | వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య పోరులో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్, బ్యాటింగ్ ఎలా ఉన్నా.. ఫీల్డింగ్‌లో మాత్రం పాకిస్థాన్ జట్టు ఎప్పుడూ అత్యుత్తమ ప్రమాణాలు కనబర్చలేదనేది వాస్తవం కాగా.. తాజా మ్యాచ్‌లోనూ ఇలాంటి సంఘటనే వెలుగు చూసింది. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బవుమా కొట్టిన బంతిని మిడాన్‌లో ఆగా సల్మాన్ అందుకోగా.. వికెట్ల వెనుక ఉన్న మహమ్మద్ రిజ్వాన్ ‘మార్ దే.. మార్ దే’ అంటూ బిగ్గరగా అరిచాడు. దీంతో బంతి అందుకున్న సల్మాన్ గురి చూసి వికెట్లకు విసరాల్సిన బంతిని బౌలర్ మహమ్మద్ నవాజ్పైకి సంధించాడు. దీంతో ఒక్కసారిగా దూసుకొచ్చిన బంతిని అడ్డుకునేందుకు నవాజ్ తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
పాకిస్థాన్ ఫీల్డింగ్ అంటే అంతే!
వికెట్లను కొట్టమంటే.. తమ ప్లేయర్లనే టార్గేట్ చేసిన ఆగా సల్మాన్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘వికెట్లు ఎక్కడున్నాయో కూడా తెలియడం లేదా నీకు’ అని ఒకరు కామెంట్ చేస్తే.. ‘విసరమంది వికెట్ల మీదకు రా బాబు.. బౌలర్ మీదికి కాదు’ అని మరో అభిమాని అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే వన్డే ప్రపంచకప్‌లో నాసిరకం ఫీల్డింగ్‌తో సొంతం దేశ మాజీ ప్లేయర్లతోనే చివాట్లు తీన్న పాకిస్థానీలు ఈ మ్యాచ్‌లో మరీ నాసిరకం ప్రదర్శన కనబర్చారు.
షాదాబ్‌కు గాయం!
ఈ మ్యాచ్ తొలి ఓవర్లోనే పాకిస్థాన్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ గాయపడ్డాడు. మిడాన్ ఫీల్డింగ్ చేస్తూ.. బవుమా కొట్టిన బంతిని ఆపిన షాదాబ్ డైవ్ చేస్తూ బాల్‌ను త్రో చేసే క్రమంలో కిందపడ్డాడు. దీంతో గాయపడ్డ షాదాబ్ మైదానాన్ని వీడాడు. స్పిన్‌కు సహకారం లభిస్తున్న చెన్నై పిచ్‌పై షాదాబ్ సేవలు అందుబాటులో లేకపోవడంతో పాకిస్థాన్ జట్టు పరిస్థితి మరీ ఘోరంగా మారింది. బ్యాటింగ్‌లో చక్కటి షాట్లతో ఆకట్టుకున్న షాదాబ్ (36 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) బౌలింగ్ ఒక్క ఓవర్ కూడా వేయకుండానే గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

