సిల్వర్‌స్టోన్: రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఆదివారం బ్రిటిష్ గ్రాండ్‌ప్రి టైటిల్ దక్కించుకున్న వెర్స్టాపెన్ ఫార్ములావన్‌లో వరుసగా ఆరో ట్రోఫీ కైవసం చేసుకున్నాడు. పోల్ పొజిషన్ నుంచి రేసును ప్రారంభించిన వెర్స్టాపెన్ ఆరంభంలో కాస్త నెమ్మదించినా..
రేసు ముందుకు సాగుతున్నా కొద్ది తన వేగంతో కట్టిపడేశాడు. గంటా 25 నిమిషాలా 16 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానం దక్కించుకున్నాడు. నోరిస్ (మెక్లారెన్), హామిల్టన్ (మెర్సెడెస్) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నారు.