పారిస్: యూఈఎఫ్ఏ చాంపియన్స్ లీగ్ టోర్నీలో రియల్ మాడ్రిడ్ టైటిల్ విజేతగా నిలిచింది. శనివారం అర్ధరాత్రి(భారత కాలమానం ప్రకారం) జరిగిన ఫైనల్ పోరులో రియల్ మాడ్రిడ్ 1-0 తేడాతో లివర్పూల్పై అద్భుత విజయం సాధించింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఫైనల్లో మాడ్రిడ్ తరఫున వినీ జూనియర్(59ని) ఏకైక గోల్ చేశాడు. చాంపియన్స్ లీగ్ టైటిల్ను దక్కించుకోవడం రియల్ మాడ్రిడ్ జట్టుకు రికార్డు స్థాయిలో ఇది 14వ సారి కావడం విశేషం. మ్యాచ్ ప్రథమార్ధం ఇరు జట్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి.