Nikhil Sosale: ఎవరీ నిఖిల్ సోసేల్?..ఆర్సీబీతో అతనికి లింకేంటి?
Nikhil Sosale: ఆర్సీబీ మార్కెటింగ్, రెవన్యూ హెడ్‌గా ఉన్న నిఖిల్ సోసేల్ను బెంగుళూరు పోలీసులు అరెస్టు చేశారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో నమోదు అయిన కేసు అంశంలో అతన్ని అదపులోకి తీసుకున్నారు. ఆర్సీబీ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి చెందిన మరో ముగ్గుర్ని కూడా అరెస్టు చేశారు.
బెంగుళూరు: ఐపీఎల్ విజేత ఆర్సీబీ విక్టరీ పరేడ్‌లో అపశృతి చోటుచేసుకున్న విషయం తెలిసిందే. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతిచెందారు. ఆ ఘటనలో ఇవాళ ఆర్సీబీ ఉద్యోగి నిఖిల్ సోసేల్( Nikhil Sosale)ను అరెస్టు చేశారు. ముంబై వెళ్తున్న అతన్ని కెంపగౌడ విమానాశ్రయం వద్ద అదుపులోకి తీసుకున్నారు. తొక్కిసలాటకు కారణమైన ఆర్సీబీ ప్రతినిధులను అరెస్టు చేయాలని సీఎం సిద్దరామయ్య ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పనిచేస్తున్న సోసేల్తో పాటు మరో ముగ్గుర్ని కూడా అరెస్టు చేశారు. లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం నిఖిల్ .. 1986 ఆగస్టు 18వ తేదీన జన్మించాడు. గత రెండేళ్ల నుంచి ఆర్సీబీ మార్కెటింగ్, రెవన్యూ హెడ్‌గా ఉన్నాడతను. డియాగో ఇండియా కంపెనీలో ఆయన ఉద్యోగం చేస్తున్నాడు. ఆర్సీబీ ఓనర్స్ యునైటెడ్ స్పిరిట్ లిమిటెడ్‌ను డియాగో ఇండియా ఆపరేట్ చేస్తున్నది.
విజయ్ మాల్యా తప్పుకోవడంతో ఆర్సీబీకి ఫుల్ టైం ఓనర్లుగా యూఎస్ఎల్ మారింది. ఆర్సీబీ బ్రాండ్ డిజైన్, స్ట్రాటజీ వెనుక నిఖేల్ సోసేల్ ఇంచార్జీగా వ్యవహరించారు. ఐపీఎల్లో ఆర్సీబీ పాపులర్ టీమ్‌గా ఉన్న విషయం తెలిసిందే. డియాగో కంపెనీలో 13 ఏళ్లుగా బెంగుళూరు నుంచి నిఖిల్ పనిచేస్తున్నాడు. ఆర్సీబీ ఫ్రాంచైజీతో అతను క్లోజ్‌గా పనిచేశాడు. ఆర్సీబీ బిజినెస్ పార్ట్నర్షిప్ హెడ్‌గా చేశాడు. ఆర్సీబీ ప్రైవేటు బాక్సుల్లో క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్కా శర్మతో కలిసి అతను తరుచూ కనిపించాడు. అతని ఇన్‌స్టా అకౌంట్‌ను కోహ్లీ ఫాలోఅవుతున్నాడు.
ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఉన్న జేమ్స్ కుక్ యూనివర్సిటీలో నిఖిల్ సోసేల్ డబుల్ మేజర్ డిగ్రీ చేశారు. చాన్నాళ్ల నుంచి ఆర్సీబీ లింకు ఉన్న నేపథ్యంలో.. బస్ పరేడ్ నిర్వహించడంలో అతని పాత్ర ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఆటగాళ్లతో పాటు ఫ్రాంచైజీ అధికారులతో కమ్యునికేషన్ ఏర్పాటులో అతని పాత్ర కీలకమైందిగా అంచనా వేస్తున్నారు.
డీసీపీ అక్షయ్ నేతృత్వంలోని క్రైం బ్రాంచ్ పోలీసులు ఆర్సీబీ టీంను అరెస్టు చేశారు. నిందితుల్ని సీఐడీకి అప్పగించనున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

