నేటి నుంచి రంజీ ట్రోఫీ ఇటు స్టార్లు.. అటు కుర్రాళ్లు
జాతీయ జట్టులోకి రావాలని ఆశిస్తున్న కుర్రాళ్లు.. మళ్లీ ఫామ్ అందుకోవాలని చూస్తున్న స్టార్లు.. తమలో సత్తా చాటలేదని నిరూపించుకునేందుకు వెటరన్లు ఎదురుచూస్తున్న దేశవాళీ అత్యుత్తమ టోర్నీ రంజీ ట్రోఫీకి రంగం సిద్ధమైంది.ఆదివారం నుంచి దేశ వ్యాప్తంగా వివిధ వేదికల్లో తొలి రౌండ్ పోటీలు ప్రారంభం అవుతాయి. గత సీజన్లో బలమైన కర్ణాటకను ఓడించి తొలిసారి ట్రోఫీ నెగ్గి చరిత్ర సృష్టించిన జమ్మూ కాశ్మీర్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది.
న్యూఢిల్లీ: జాతీయ జట్టులోకి రావాలని ఆశిస్తున్న కుర్రాళ్లు.. మళ్లీ ఫామ్ అందుకోవాలని చూస్తున్న స్టార్లు.. తమలో సత్తా చాటలేదని నిరూపించుకునేందుకు వెటరన్లు ఎదురుచూస్తున్న దేశవాళీ అత్యుత్తమ టోర్నీ రంజీ ట్రోఫీకి రంగం సిద్ధమైంది.ఆదివారం నుంచి దేశ వ్యాప్తంగా వివిధ వేదికల్లో తొలి రౌండ్ పోటీలు ప్రారంభం అవుతాయి. గత సీజన్లో బలమైన కర్ణాటకను ఓడించి తొలిసారి ట్రోఫీ నెగ్గి చరిత్ర సృష్టించిన జమ్మూ కాశ్మీర్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. శ్రీనగర్‌లో జరిగే తమ తొలి పోరులో జమ్మూ .. మధ్యప్రదేశ్‌తో పోటీ పడనుంది. ఈసారి ఆ జట్టును అడ్డుకునేందుకు ముంబై, కర్ణాటక, బెంగాల్, ఢిల్లీ, సౌరాష్ట్ర, విదర్భ వంటి దిగ్గజాలతో పాటు మధ్యప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్ జట్లు గట్టి పోటీకి సిద్ధమయ్యాయి. మొత్తం 38 జట్లు బరిలో నిలిచాయి. ఎలైట్ విభాగం గ్రూప్-ఏ,బీ,సీ,డీల్‌లో ఎనిమిదేసి చొప్పున బరిలో ఉండగా.. ప్లేట్ గ్రూప్‌లో 6 ఈశాన్య రాష్ర్టాల జట్లు పోటీలో ఉన్నాయి.
బరిలో టీమిండియా ఆటగాళ్లు
ఈ సీజన్ రంజీ ట్రోఫీలో పెద్ద సంఖ్యలో భారత అంతర్జాతీయ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. కేఎల్ రాహుల్ (కర్ణాటక), యశస్వి జైస్వాల్ (ముంబై) రాబోయే న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌కు ముందు ప్రాక్టీస్ కోసం రెడ్ బాల్ మ్యాచ్‌లు ఆడనున్నారు. రవీంద్ర జడేజా (సౌరాష్ట్ర), రజత్ పటీదార్ (మధ్యప్రదేశ్) తమ ఫామ్‌ను కొనసాగించేందుకు సన్నాహకాల్లో భాగమయ్యారు. మరోవైపు జాతీయ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించేందుకు పలువురు వర్ధమాన క్రీడాకారులు వేచి చూస్తున్నారు. బీహార్ నుంచి యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ, సాకిబుల్ గని ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
షమీపై ఫోకస్
2023 నుంచి టెస్టులకు, 2025 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్న సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి ఈ రంజీ సీజన్ అత్యంత కీలకం కానుంది. ఇటీవలే 36 ఏండ్ల భువనేశ్వర్ కుమార్ భారత టీ20 జట్టులోకి పునరాగమనం చేయడంతో షమీకి కూడా ఆశలు చిగురించాయి. గత సీజన్ రంజీలో బెంగాల్ తరఫున 37 వికెట్లతో పాటు దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ విజయంలో షమీ కీలక పాత్ర పోషించాడు. రాబోయే ఆస్ట్రేలియాతో 5 టెస్టుల సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని బెంగాల్ తరఫున నిప్పులు చెరిగేందుకు అతను సిద్ధమవుతున్నాడు.

Siraj
జింఖానాలో త్రిపురతో సిరాజ్ సేన ఢీ
గత కొన్నేండ్లుగా తీవ్రంగా నిరాశపరుస్తున్న హైదరాబాద్ జట్టు టీమిండియా స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ కెప్టెన్సీలో ఈ రంజీ సీజన్లో అదృష్టాన్ని పరీక్షించుకుంది. గ్రూప్-బీలో భాగంగా జింఖానా మైదానంలో జరిగేతొలి పోరులో త్రిపురతో పోటీ పడనుంది. బ్యాటింగ్‌లో సీనియర్ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్, రాహుల్ సింగ్, అభిరథ్ రెడ్డి, హిమతేజ ఆతిథ్య జట్టు బలంగానే ఉంది. బౌలింగ్‌లో సిరాజ్‌కు తోడు వైస్ కెప్టెన్, ఆల్‌రౌండర్ సీవీ మిలింద్, రక్షణ్ రెడ్డి, స్పిన్నర్లు తనయ్ త్యాగరాజన్, అనికేత్ రెడ్డి బరిలో ఉన్నారు. జింఖానాలో ఇటీవలే 9 కొత్త పిచ్‌లు ఏర్పాటు చేశారు. ఉదయం పూట వికెట్ పేసర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో సిరాజ్, రక్షణ్, మిలింద్ కీలకం కానున్నారు. మరోవైపు మణిశంకర్ నాయకత్వంలోని త్రిపుర జట్టులో మణ్‌దీప్ సింగ్, హైదరాబాద్ మాజీ కెప్టెన్ విహారి వంటి సీనియర్లు బరిలో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

