GT vs RR : క్వాలిఫయర్ 2 ఫైట్‌కు మరికాసేపట్లో తెరలేవనుంది. క్వాలిఫయర్ 1లో ఆర్సీబీ చేతిలో చిత్తైన గుజరాత్ టైటాన్స్(Gujarat Titans).. ఎలిమినేటర్‌లో భారీ విజయంతో దూసుకొచ్చిన రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)ను ఢీకొడుతోంది. లీగ్ దశలో ఇరుజట్లు చెరొక విజయం సాధించడంతో ముల్లన్‌పూర్‌లో గెలుపు ఎవరిది? అనేది ఉత్కంఠ రేపుతోంది. టాస్ గెలిచిన రియాన్ పరాగ్ బ్యాటింగ్ తీసుకున్నాడు. ఇరుజట్లకిది మూడో క్వాలిఫయర్ 2 కావడంతో మూడోసారి ఫైనల్ ఆడేందుకు సర్వశక్తులు ఒడ్డనున్నాయి.
ఐపీఎల్ 19 ఫైనల్లో ఆర్సీబీని ఢీకొనేందుకు గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీపడుతున్నాయి. ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించిన రియాన్ పరాగ్ సేన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా.. విజయంతో మూడో ఫైనల్ ఆడాలని గుజరాత్ పట్టుదలతో ఉంది. అయితే.. సన్‌రైజర్స్‌పై కేవలం 27 బంత్లులోనే 97 పరుగులతో రెచ్చిపోయిన వైభవ్‌ను ఆపితేనే శుభ్‌మన్ గిల్ బృందం ముందుకెళ్లే అవకాశముంది. గేల్ రికార్డుకు ఒక్క బంతి దూరంలో ఆగిపోయిన వైభవ్.. ఈసారి వేగవంతమైన శతకంతో చరిత్ర సృష్టించేనా? అని అభిమానులు, కామెంటేటర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు.
History meets destiny 🤝
A look at how #GT and #RR have performed in #Qualifier2 over the years 🤜🤛
Who prevails tonight? 🤔#TATAIPL | #TheFinalLeap | #GTvRR pic.twitter.com/wxOZ5EZuLL
— IndianPremierLeague (@IPL) May 29, 2026
బ్యాటింగ్‌లో గిల్, సుదర్శన్, బట్లర్‌పై ఎక్కువగా ఆధారపడుతున్న గుజరాత్‌కు బౌలర్లే ప్రధాన బలం. కానీ, రాజస్థాన్‌కు వైభవ్‌తో పాటు జురెల్, యశస్వీ, ఫెరీరా, శనక భారీ హిట్టింగ్తో రాణిస్తున్నారు. పేసర్ ఆర్చర్ నిప్పులు చెరుగుతుండగా బర్గర్, బ్రిజేశ్ శర్మ, యశ్ పంజాలు మిడిల్ ఓవర్లలో వికెట్లు తీస్తూ విజయాల్లో కీలకమవుతున్నారు. అన్ని విభాగాల్లోనూ సమతూకంగా కనిపిస్తున్న రాజస్థాన్‌ను అడ్డుకోవాలంటే గుజరాత్ బ్యాటర్లు, బౌలర్లు చెమటోడ్చక తప్పదు.
రాజస్థాన్ తుది జట్టు : యశస్వీ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, జురెల్(వికెట్ కీపర్), పరాగ్(కెప్టెన్), ఫెరీరా, శనక, జడేజా, ఆర్చర్, బర్గర్, బ్రిజేష్ శర్మ. యశ్ సింగ్ పంజా.
గుజరాత్ తుది జట్టు : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), బట్లర్(వికెట్ కీపర్), సుందర్, నిషాంత్ సింధు, హోల్డర్, రషీధ్ ఖాన్, సిరాజ్, రబడ, ప్రసిధ్ కృష్ణ, సాయి కిషోర్.