Canada Open | కెనడా ఓపెన్ క్వార్టర్స్‌లో సింధు, లక్ష్యసేన్
Canada Open : ఒలింపిక్స్ విజేత పీవీ సింధు(PV Sindhu) కెనడా ఓపెన్(Canada Open)లో అదరగొడుతోంది. మహిళల సింగిల్స్‌లో ఈ స్టార్ షట్లర్ క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. తొలి రౌండ్లో 21-16, 21-9తో టైలాను చిత్తుచేసిన సింధుకు ప్రి - క్వార్టర్స్‌లో ప్రత్యర్థి నుంచి వాకొవర్ లభించింది. మరోవైపు.. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో భారత యువ షట్లర్...
Canada Open : ఒలింపిక్స్ విజేత పీవీ సింధు(PV Sindhu) కెనడా ఓపెన్(Canada Open)లో అదరగొడుతోంది. మహిళల సింగిల్స్‌లో ఈ స్టార్ షట్లర్ క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. తొలి రౌండ్లో 21-16, 21-9తో టైలాను చిత్తుచేసిన సింధుకు ప్రి – క్వార్టర్స్‌లో ప్రత్యర్థి నుంచి వాకొవర్ లభించింది. దీంతో నేరుగా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టిన సింధు.. ఫాంగ్ జై(Gao Fangjie)తో అమీతుమీ తేల్చుకోనుంది.
మరోవైపు.. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో భారత యువ షట్లర్ లక్ష్యసేన్(Lakshya Sen) మరో అడుగు ముందుకేశాడు. 21-15, 21-11తో యోగర్ కొలిహో (Ygor Coelho) నెగ్గి క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించాడు. ఈ సీజన్లో అంతగా ఆకట్టుకోని అతను ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగి వరుస గేమ్‌ల్లో విజయం సాధించడం విశేషం. పురుషుల డబుల్స్‌లో ప్రసాద్(Prasad)-విష్ణువర్ధన్ గౌడ్(Vishnuvardhan Goud) జోడీ ప్రిక్వార్టర్స్‌లో ఓడి, ఇంటి బాట పట్టింది.
లక్ష్యసేన్

కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం
ఒలింపిక్స్ మహిళల విభాగంలో రెండు పతకాలు సాధించిన ఏకైక అథ్లెట్‌గా చరిత్రకెక్కిన పీవీ సింధు.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఈ తెలుగమ్మాయి.. ఒక్క టైటిల్ నెగ్గేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. నిరుడు బర్మింగ్‌హామ్ కామన్వెల్త్(birmingham commonwealth games) క్రీడల్లో స్వర్ణం సాధించిన సింధు.. ఇప్పటివరకు మరో టైటిల్ గెలువలేకపోయింది. గాయం నుంచి కోలుకొని కోర్టులో అడుగుపెట్టిన సింధు ఆటలో మునుపటి జోరు కనబర్చలేకపోతోంది. వరల్డ్ టూర్ ర్యాంకింగ్ టోర్నీల్లో అడపాదడపా విజయాలు సాధిస్తున్నా.. టైటిల్ సాధించడంలో విఫలమవుతోంది.
ఇవి కూడా చదవండి
Sadagoppan Ramesh | ఒకప్పుడు ఓపెనర్.. ఇప్పుడు సినిమా హీరో.. తమిళ తెరపై మెరుస్తున్న మాజీ క్రికెటర్
Cheteshwar Pujara | వేటు పడ్డాక ఆట మెరుగైంది… దులీప్ ట్రోఫీలో శతక్కొట్టిన పుజారా
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

