సింధు 11వ సారీ
భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు మళ్లీ నిరాశే. వరల్డ్ నంబర్ వన్ అన్ సె యంగ్ అడ్డును మరోసారి దాటలేపోయిన సింధు ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో రన్నరప్‌తో సరిపెట్టింది.
- అన్ సె యంగ్ చేతిలో ఓటమి
- ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌తో సరి
పారిస్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు మళ్లీ నిరాశే. వరల్డ్ నంబర్ వన్ అన్ సె యంగ్ అడ్డును మరోసారి దాటలేపోయిన సింధు ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో రన్నరప్‌తో సరిపెట్టింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో సింధు 21-16, 11-21, 12-21తో టాప్ సీడ్ దక్షిణ కొరియా స్టార్ సె యంగ్ చేతిలో పోరాడి ఓడిపోయింది. సెయంగ్ చేతిలో సింధుకు ఇది వరుసగా 11వ ఓటమి. గంటకు పైగా సాగిన ఫైనల్ పోరులో తొలి గేమ్‌లో సింధు అద్భుతంగా ఆడింది.
తన ఎత్తును ఉపయోగించుకుంటూ పవర్ ఫుల్ స్మాష్‌లు, క్రాస్ కోర్ట్ స్మాష్‌లతో విజృంభించి తొలి గేమ్‌ను గెలుచుకుంది. కానీ, రెండో గేమ్‌లో అన్ సె యంగ్ తన అసలు నైపుణ్యాన్ని బయటకు తీసింది. లైన్‌ను పక్కాగా అంచనా వేయడంతో పాటు నిలకడైన నెట్ ప్లేతో సింధును ఒత్తిడిలోకి నెడుతూమ్యాచ్ను మూడో గేమ్‌కు తీసుకెళ్లింది. నిర్ణయాత్మక గేమ్ ఆరంభంలో గట్టి పోటీ ఇచ్చిన సింధు 8-5తో ఆధిక్యంలో నిలిచి టైటిల్‌పై ఆశలు రేపింది. కానీ, సెయంగ్ వెంటనే పుంజుకుని స్కోరును 8-8తో సమం చేశాక పవర్ ఫుల్ షాట్లతో చెలరేగింది. ఒత్తిడిలో సింధు అనవసర తప్పిదాలు చేసి మ్యాచ్ కోల్పోయింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

