LSG vs PBKS | టాస్ గెలిచిన పంజాబ్.. టెండూల్కర్‌కు మొదటి ఛాన్స్..!
లక్నో వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ సారథి శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. లక్నో తుది జట్టులోకి వచ్చిన అర్జున్ టెండూల్కర్ ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడనున్నాడు.
LSG vs PBKS : ప్లే ఆఫ్స్ చివరి బెర్తుకు పోటీ పడుతున్న పంజాబ్ కింగ్స్ చావోరేవో మ్యాచ్ ఆడుతోంది. చివరి లీగ్ మ్యాచ్‌లో ఆ జట్టు టోర్నీ నుంచి ఇప్పటికే వైదొలిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ను ఢీ కొడుతోంది. లక్నో వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ సారథి శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. లక్నో తుది జట్టులోకి వచ్చిన అర్జున్ టెండూల్కర్ ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్నాడు.
లీగ్ దశ ఆరంభంలో వరసగా ఆరు విజయాలు.. ఆపై వరసగా ఆరు పరాజయాలతో ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడింది పంజాబ్. చివరి బెర్తుకు రాజస్థాన్, కోల్‌కతా నుంచి పోటీ ఎదురవుతున్న వేళ విజయంతో ఆశలు సజీవంగా ఉంచుకోవాలని పంజాబ్ కసితో ఉంది. అయితే.. పోతూపోతూ పంజాబ్ ఆశల్ని ఆవిరి చేయాలనుకుంటున్న లక్నో విజయంతో టోర్నీని ముగించాలని ఆశిస్తోంది. ప్రథమార్ధంలో లక్నోను 54 పరుగులతో ఓడించిన అయ్యర్ సేన.. అదే ఫలితంతో ముందంజ వేస్తుందా? చేతులెత్తేసి ఇంటిదారి పడుతుందా? అనేది మరి కాసేపట్లో తెలియనుంది.
🚨Toss update from Lucknow 🚨@PunjabKingsIPL won the toss and elected to bowl first against @LucknowIPL
Updates ▶️ https://t.co/2ADKr4dqhi#TATAIPL | #KhelBindaas | #LSGvPBKS pic.twitter.com/FZTDevYeis
— IndianPremierLeague (@IPL) May 23, 2026
పంజాబ్ తుది జట్టు : ప్రభ్‌సిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కొన్నొల్లి, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), సూర్యాన్ష్ శెడ్గే, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, యాన్సెన్, విజయ్‌కుమార్, అర్ష్‌దీప్, చాహల్.
ఇంప్యాక్ట్ సబ్స్ – హర్‌ప్రీత్ బ్రార్, స్టోయినిస్, బార్ట్లెట్, విష్ణు వినోద్, ప్రవీణ్ దూబే.
లక్నో తుది జట్టు : ఇంగ్లిస్, అర్షిన్ కులకర్ణి, పూరన్, బదొని, పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), సమద్, ముకుల్ చౌదరీ, అర్జున్ టెండూల్కర్, షమీ, ప్రిన్స్ యాదవ్, మొహ్సిన్ ఖాన్.
ఇంప్యాక్ట్ సబ్స్ – షెహబాజ్ అహ్మద్, దిగ్వేష్ రథీ, సిద్ధార్థ్, హిమ్మత్ సింగ్, ఆకాశ్ సింగ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

