Shoaib Malik’s Wife | ‘సనా’ను సానియా మీర్జా చేసిన పాకిస్తాన్ ఫ్యాన్స్.. మాలిక్ మూడో భార్యతో..!
Shoaib Malik's Wife | షోయభ్ మాలిక్ ఇటీవలే టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు విడాకులు ఇచ్చి ఆ దేశ నటి సనా జావేద్‌ను మూడో పెండ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గతనెలలో ఈ ఇద్దరూ హడావిడి లేకుండా బంధుమిత్రుల సమక్షంలో వివాహబంధంతో ఒక్కటయ్యారు.
Shoaib Malik’s Wife | పాకిస్తాన్ వెటరన్ ఆల్‌రౌండర్ షోయభ్ మాలిక్ ఇటీవలే టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు విడాకులు ఇచ్చి ఆ దేశ నటి సనా జావేద్‌ను మూడోపెండ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గతనెలలో ఈ ఇద్దరూ హడావిడి లేకుండా బంధుమిత్రుల సమక్షంలో వివాహబంధంతో ఒక్కటయ్యారు. అయితే సానియాతో విడిపోయినా పాక్ ఫ్యాన్స్ మాత్రం మాలిక్ మాజీ భార్య పేరునే జపిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) లో కరాచీ కింగ్స్ తరఫున ఆడుతున్న మాలిక్ ఆట చూసేందుకు స్టేడియానికి వచ్చిన సనాను ‘సానియా మీర్జా’ అంటూ అరుస్తూ ఆట పట్టించారు. ఆమె చూస్తున్నదని తెలిసినా పదే పదే ‘సానియా.. సానియా’ అంటూ అరుస్తూ ఆమెను టీజ్ చేశారు.
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగంగా రెండ్రోజుల క్రితం ముల్తాన్ సుల్తాన్స్, కరాచీ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ను చూసేందుకు వచ్చిన సనాను మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానులు ఆటపట్టించారు. మ్యాచ్ ముగియగానే సనా అక్కడ్నుంచి ఇంటికి వెళ్లిపోతున్న క్రమంలో కొందరు తుంటరి అభిమానులు.. మాలిక్ మాజీ భార్య ‘సానియా మీర్జా’ అంటూ అరిచారు. ఆ అరుపులు విన్న సనా.. వారి వైపునకు అసహనంగా చూస్తూ అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
2010లో మాలిక్.. సానియా మీర్జాను పెళ్లి చేసుకున్న విషయం విదితమే. ఈ దంపతులు 2018లో ఇజాన్ మాలిక్‌కు జన్మనిచ్చారు. కానీ గత రెండేండ్లుగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్న ఈ జోడీ ఇటీవలే ఆ బంధానికి గుడ్ బై చెప్పింది. గత నెలలో మాలిక్.. సనా జావేద్‌ను రెండో పెండ్లి చేసుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

