IPL 2023: ఐపీఎల్ 2023లో భాగంగా ఈ రోజు పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ వెళ్తూ వెళ్తూ పంజాబ్‌నకు కూడా నష్టం చేకూర్చాలని చూస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్ దిశగా అడుగులు వేయాలని పంజాబ్ భావిస్తోంది. 2013 తర్వాత మొదటిసారి ధర్మశాలలో ఐపీఎల్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు.
గత మూడు మ్యచుల్లో ఆడని కగిసో రబాడా ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే రబాడా బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్‌కు మంచి రికార్డు లేదు. ఇప్పటివరకు మూడుసార్లు ఔట్ అయ్యాడు. అంతేకాకుండా కగిసో రబాడాకు ఎడమచేతి వాటం బ్యాటర్లపై మంచి రికార్డు ఉండటం పంజాబ్‌కు కలిసొచ్చే అంశం.
వార్నర్‌తో పాటు నెట్స్‌లో ప్రాక్టీస్ చేసిన పావెల్ ఈ రోజు మ్యాచ్‌లో ఆడేందుకు అవకాశం ఉంది. రోసౌ స్థానంలో అతడు ఆడే అవకాశం ఉంది. ఇషాంత్ శర్మకు శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్‌లపై మంచి రికార్డు ఉంది. వీరిపై మంచి ఎకానమీ రేట్‌తో ఇషాంత్ శర్మ వీరిని రెండు సార్లు ఔట్ చేశాడు. మరోసారి ఇషాంత్ శర్మ వీరిపై ఆధిపత్యం కొనసాగించాలనుకుంటున్నాడు.