WI vs IRE : మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్ సంచలనం సృష్టించింది. మాజీ ఛాంపియన్ వెస్టిండీస్ సెమీస్ అవకాశాల్ని సంక్లిష్టంగా మార్చేసింది. బలమైన విండీస్‌ను128కే కట్టడి చేసిన ఐరిష్ టీమ్.. స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఒర్లా ప్రెండెర్‌గాస్ట్(63) అర్ధ శతకంతో కదం తొక్కగా.. ఓపెనర్ అమీ హంటర్(28) విలువైన ఇన్నింగ్స్ ఆడింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 62 రన్స్‌తో గెలుపు పునాది వేయగా రెబెక్కా స్టాకెల్(16 నాటౌట్), లిటిల్(నాటౌట్) లాంఛనం ముగించారు. దాంతో, నాలుగో విజయంతో సెమీస్ చేరాలనుకున్న కరీబియన్ జట్టు.. ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్ ఫలితం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నాలుగు పరాజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించిన ఐర్లాండ్ ఆఖరి పంచ్ విసిరింది. పోతూపోతూ సెమీస్ బెర్తుకు అడుగుదూరంలోని వెస్టిండీస్‌ను ఓడించింది. శుక్రవారం భారత్‌పై పురుషుల జట్టు చరిత్రాత్మక విజయాన్ని స్ఫూర్తిగా తీసుకున్న మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. మొదట బౌలర్ల కృషితో ప్రత్యర్థిని 128కే కట్టడి చేసిన ఐరిష్ టీమ్. స్వల్ప ఛేదనను ఐర్లాండ్ ఓపెనర్లు దూకుడుగా ఆరంభించారు. గాబి లెవిస్(9) త్వరగానే ఔటైనా.. అమీ హంటర్(28) జతగా ఒర్లా ప్రెండెర్‌గాస్ట్(63) నిలబడింది.
Another @T20WorldCup fifty for Orla 👏☘️#BackingGreen | #IREvWI | #T20WorldCup pic.twitter.com/4sSaUqv4oB
— Cricket Ireland (@cricketireland) June 27, 2026
విండీస్ స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొన్న ఈ ద్వయం స్కోర్ బోర్డును ఉరికించింది. చకచకా సింగిల్స్, డబుల్స్ తీసిన ఈ జంట విండీస్ బౌలర్లను విసిగించింది. రెండో వికెట్‌కు 62 రన్స్ జోడించిన హంటర్‌ను స్టెఫానీ టేలర్ డైవింగ్ క్యాచ్‌తో పెవిలియన్ పంపింది. అప్పటికీ ఐర్లాండ్ విజయానికి 42 బంతుల్లో 41 రన్స్ కావాలి. హంటర్ వెనుదిరిగాక దూకుడు పెంచిన ప్రెండెర్‌గాస్ట్ స్వీప్, కట్ షాట్లతో అలరించింది.
A landmark win for Ireland 👏
Their first-ever victory at the Women’s T20 World Cup keeps the semi-final race in Group 2 alive, with New Zealand now controlling their own destiny against England at Lord’s later today pic.twitter.com/c4EvJBwqcL
— Cricinfo (@cricinfo) June 27, 2026
మునిసర్ ఓవర్లో తొలి బంతికి బౌండరీతో అర్ధ శతకం పూర్తి చేసుకున్న తను.. బంతిని స్టాండ్స్‌లోకి పంపబోయి బౌండరీ వద్ద డాటిన్ చేతికి చిక్కింది. అనంతరం.. లీహ్ పౌల్(4) వెనుదిరిగినా.. రెబెక్కా స్టోకెల్(16 నాటౌట్) ఒత్తిడికి లోనవ్వకుండా ఆడి చిరస్మరణీయ విజయాన్ని అందించింది. ఐర్లాండ్ విజయంతో సెమీస్‌పై ఆశలు పెట్టుకున్న శ్రీలంక సైతం టోర్నీ నుంచి నిష్క్రమించింది.
టాస్ ఓడిన వెస్టిండీస్ భారీ సోర్ కొడుతుందనుకుంటే అనూహ్యంగా 128కే పరిమితమైంది. తొలి ఓవర్ చివరి బంతికే ఓపెనర్ క్వియానా జోసెఫ్(8) ఔటవ్వగా.. క్యాంప్‌బెల్(4) రెండో వికెట్‌గా వెనుదిరిగింది. ఐరిష్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో విండీస్ హిట్టర్లు బ్యాట్ ఝులిపించలేకపోయారు. కెప్టెన్ హేలీ మాథ్యూస్(22), చినెల్లె హెన్రీ (27), డియాండ్ర డాటిన్(21) రాణించగా.. ఐరిష్ బౌలర్లలో ఐమీ మగిరీ, కార ముర్రే తలా రెండేసి వికెట్లు తీశారు.