Grand Chess Tour : క్రొయేషియా వేదికగా జరుగుతున్న గ్రాండ్ చెస్ టూర్(Grand Chess Tour)లో ఆర్.ప్రజ్ఞానంద (R Praggnanandhaa) అదరగొడుతున్నాడు. ర్యాపిడ్ విభాగం చివరిరోజు మూడుకు మూడు మ్యాచుల్లో గెలుపొందిన భారత స్టార్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. ఫ్రాన్స్ ఆటగాడు అలీరెజా ఫిరౌజాతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే.. వరల్డ్ ఛాంపియన్ డి.గుకేశ్(D.Gukesh) అనూహ్యంగా మూడు ఓటములతో ఐదో స్థానంలో నిలిచాడు.
ప్రతిష్ఠాత్మక గ్రాండ్ చెస్ టూర్లో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద జోరు చూపించాడు. ర్యాపిడ్ చెస్ అంటే చాలు చెలరేగిపోయే ప్రజ్ఞానంద చివరిరోజు తనకు తిరుగులేదని చాటుతూ మూడు మ్యాచుల్లో విజయం సాధించాడు. చివరి రోజు ఇవాన్ సరిక్(క్రొయేషియా), డీక్ బొగ్డన్(రొయేనియా), నెదర్లాండ్ గ్రాండ్‌మాస్టర్ అనిశ్ గిరిను ఓడించి 12 పాయింట్లు కొల్లగొట్టాడు.
🚨#news l Praggnanandhaa storms to joint lead 🔥 at the Grand Chess tour in Zagreb ♟️
Three wins on the final day over Saric, Deac and Giri take him to 12 points, level with the Frenchman after the rapid section.
Gukesh draws all three to sit on 10.
18 blitz rounds still to…
— The Bridge (@the_bridge_in) July 4, 2026
హ్యాట్రిక్ విక్టరీలు కొట్టిన భారత స్టార్ ప్లేయర్ ఫ్రాన్స్ ఆటగాడు అలీరెజా ఫిరౌజాతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానం సాధించాడు. ర్యాపిడ్ చెస్‌లో మూడుకు మూడు కోల్పోయిన డి.గుకేశ్, జర్మనీ ప్లేయర్ విన్సెంట్ కేమెర్ 10 పాయింట్లతో సంయుక్తంగా ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. తదుపరి బ్లిట్జ్ విభాగంలో 18 రౌండ్లు గ్రాండ్ చెస్ టూర్ విజేతను నిర్ణయించనున్నాయి. కాబట్టి.. ఈ రౌండ్లో ప్రతి మ్యాచ్ కీలకం కానుంది.