Virat Kohli | కోహ్లీపై లాజిక్ లేని కామెంట్స్.. పీసీబీ చైర్మన్‌ను తప్పుబట్టిన పాక్ మాజీ కెప్టెన్
Virat Kohli | టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఉద్దేశిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రజా చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. నెల రోజులు విశ్రాంతి తర్వాత మళ్లీ జట్టుతో చేరిన కోహ్లీ..
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఉద్దేశిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రజా చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. నెల రోజులు విశ్రాంతి తర్వాత మళ్లీ జట్టుతో చేరిన కోహ్లీ.. ఆసియా కప్‌లో అద్భుతంగా రాణించాడు. మూడేళ్ల గ్యాప్ తర్వాత అంతర్జాతీయ సెంచరీ కూడా నమోదు చేశాడు. అయితే టీమిండియా మాత్రం గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఇదే విషయాన్ని ఎత్తిచూపిన రమీజ్ రజా.. పాకిస్తాన్ సారధి బాబర్ ఆజమ్, కోహ్లీని పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ నుంచి టీమిండియా గ్రూప్ దశలోనే నిష్క్రమించినప్పటికీ.. డెడ్ రబ్బర్ అయిన ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేయడాన్ని భారత దేశం పొగిడిందని రమీజ్ రజా అన్నాడు.
‘కోహ్లీ సెంచరీ చేస్తే.. ఆసియా కప్‌లో టీమిండియా ఓటమిని కూడా భారత మీడియా, ఫ్యాన్స్ మర్చిపోయారు. కానీ ఇక్కడ బాబర్ సెంచరీ చేసినా విమర్శలు చేస్తూనే ఉంటారు’ అని అసహనం వ్యక్తం చేశాడు. ఈ వ్యాఖ్యలను చాలా మంది తప్పుబట్టారు. తాజాగా పాక్ మాజీ సారధి సల్మాన్ బట్ కూడా రమీజ్ రజా వ్యాఖ్యలను తప్పుబట్టాడు.
తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. ‘అసలు లాజిక్ లేని వ్యాఖ్యలవి. అనవసరంగా కోహ్లీపై ఇలాంటి కామెంట్స్ ఎందుకు? తనేమీ సాధారణ ఆటగాడు కాదు కదా. ప్రపంచ క్రికెట్లో 70పైగా సెంచరీలు చేసిన రెండో ఆటగాడు’ అని చెప్పాడు. రమీజ్ రజా ఏదో చిరాకులో ఈ కామెంట్స్ చేసి ఉంటాడని బట్ అభిప్రాయపడ్డాడు. ఇవేకాకుండా ఇంకా చాలా అర్థంలేని మాటలు మాట్లాడాడని, ఇవన్నీ కూడా పసలేని కోతలేనని విమర్శించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

