RR vs MI : ఐపీఎల్‌ను వెంటాడుతున్న వర్షం కారణంగా ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఓవర్లలో కోత పడింది. గువాహటిలో వర్షం తగ్గిపోవడంతో 11 ఓవర్ల ఆట ఆడిస్తున్నారు అంపైర్లు. టాస్ గెలిచిన ముంబై సారథి హార్దిక్ పాండ్యా బౌలింగ్ తీసుకున్నాడు. రెండో విజయంపై కన్నేసిన ముంబై.. జోరుమీదున్న రాజస్థాన్‌ను హ్యాట్రిక్ కొట్టకుండా నిలువరిస్తుందా? లేదా? అనేది మరికాసేపట్లో తెలియనుంది.
ఈడెన్ గార్డెన్స్‌లో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ సాగనీయని వర్షం.. ఈసారి గువాహటిలోనూ దాపురించింది. టాస్కు ముందు నుంచే చినుకులు మొదలవ్వడంతో మ్యాచ్ టాస్ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం రాత్రి 7:00 గంటలకు వేయాల్సిన టాస్ వాన కారణంగా రాత్రి 9:55 గంటలకు వేశారు. ఈ మ్యాచ్‌తో జట్టులోకి వచ్చిన పాండ్యా రాజస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. వర్షం దెబ్బకు ఓవర్లను కుదించారు.11 ఓవర్ల మ్యాచ్ కాబట్టి పవర్ ప్లే 3.2 ఓవర్లలో పూర్తవ్వనుంది.
🚨 TOSS 🚨@mipaltan have won the toss & will field first against @rajasthanroyals
Updates ▶️ https://t.co/BCCaxRwjYg#TATAIPL | #KhelBindaas | #RRvMI pic.twitter.com/lyIVdlZjjM
— IndianPremierLeague (@IPL) April 7, 2026
ముంబై ఇండియన్స్ తుది జట్టు : రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధిర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, గజన్ఫర్, బౌల్ట్, బుమ్రా.
ఇంప్యాక్ట్ సబ్స్ – రూథర్‌ఫోర్డ్, కార్బిన్ బాస్చ్, రాబిన్ మిన్జ్, రజ్ బవా, అశ్వని కుమార్.
రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు : వైభవ్ సూర్యవంశీ, యశస్వీ జైస్వాల్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రియన్ పరాగ్(కెప్టెన్), హిట్మైర్, డొనొవాన్ ఫెరీరా, జడేజా, ఆర్చర్, బర్గర్, దేశ్‌పాండే, సందీప్ శర్మ.
ఇంప్యాక్ట్ సబ్స్ – రవి బిష్ణోయ్, రవి సింగ్, ప్రిటోరియస్, బ్రిజేష్ శర్మ.