Shahanwaz Dahani | బౌలింగ్ కోచ్ షాన్ టెయిట్పై పాక్ పేసర్ ట్వీట్.. తిట్టిపోసిన ఫ్యాన్స్.. ఎందుకంటే..?
షాన్ టెయిట్ పదవీ కాలం 2023 ఫిబ్రవరిలో పూర్తి కానుంది
Shahanwaz Dahani : పాకిస్థాన్ పేసర్ షాహనవాజ్ దహానీ తాజా ట్వీట్‌పై అభిమానులు తిట్టి పోస్తున్నారు. కారణం ఏంటంటే..? ఆజట్టు బౌలింగ్ కోచ్ షాన్ టెయిట్ గురించి దహానీ చేసిన ట్వీట్ విమర్శలకు దారి తీసింది. షాన్ టెయిట్తో ఉన్న ఫొటో పోస్ట్ చేసి. దానికి ‘నవ్వులు తీసుకొచ్చిన మిత్రడు.. నిన్న రాత్రి వెళ్లిపోయి కన్నీళ్లను మిగిల్చాడు’ అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ రాశాడు. అంతేకాదు కన్నీళ్లు, బద్ధలైన హృదయానికి సంకేతంగా ఎమోజీలు కూడా పెట్టాడు. దాంతో, ఆ పోస్ట్ చూసిన చాలామంది షాన్ టెయిట్ చనిపోయాడేమోనని అనుకున్నారు. అతను ఆస్ట్రేలియాకు వెళ్లాడనే విషయం తెలుసుకొని దహానీపై విమర్శలు చేశారు. ‘నువ్వు ట్వీట్‌ను పూర్తిగా రాయాల్సింది’ అని, ‘ఎవరైనా ఇలా ట్వీట్ చేస్తారా?’ అని చాలామంది దహానీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
షాన్ టెయిట్ పదవీ కాలం 2023 ఫిబ్రవరిలో పూర్తి కానుంది. అయితే.. అతను తన కాంట్రాక్ట్‌ను కొనసాగేందుకు ఆసక్తి చూపడం లేదు. న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన మ్యాజ్ అనంతరం అతను ఒక ట్వీట్ చేశాడు. ‘సిరీస్ ముగిసింది. బరువైన హృదయంతో పాక్‌ను వీడుతున్నా. మీ అందరినీ మిస్ అవుతున్నా’ అని ఆ ట్వీట్లో రాసుకొచ్చాడు. దహానీతో దిగిన సెల్పీని కూడా పోస్ట్ చేశాడు.
ఆసీస్ మాజీ స్పీడ్‌స్టర్ షాన్ టెయిట్ 2022 ఫిబ్రవరిలో పాకిస్థాన్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతని శిక్షణలో పాక్ బౌలింగ్ మెరుగుపడింది. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ బౌలర్లు అదరగొట్టారు. అయితే.. ఏడాది చివరలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పాక్ దారుణంగా ఓడిపోయింది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కూడా కోల్పోయింది.
A friend who brought smiles, left last night with tears😢💔. #ShaunTait pic.twitter.com/fNU3ePTieP
— Shahnawaz Dahani (@ShahnawazDahani) January 14, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

