World Cup 2023 | పాకిస్థాన్ క్రికెటర్ ఉసామా మీర్ అరుదైన ఘనత.. వన్డే ప్రపంచకప్‌లో తొలి కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా..
World Cup 2023 | షాదాబ్‌ను స్ట్రెచర్ మీద మైదానం నుంచి బయటకు తీసుకెళ్లాలని ప్రయత్నించగా.. అవసరం లేదని అతడే నడుచుకుంటూ బయటకు వెళ్లాడు. అయితే పరిస్థితి తీవ్రత దృష్ట్యా పాకిస్థాన్ జట్టు అతడి స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఉసామాను బరిలోకి దింపింది.
World Cup 2023 | పాకిస్థాన్ యువ స్పిన్నర్ ఉసామా మీర్ వన్డే ప్రపంచకప్‌లో అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో పాకిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ గాయం కారణంగా మైదానం వీడగా.. అతడి స్థానంలో ఉసామా మీర్ కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా గ్రౌండ్లో అడుగుపెట్టాడు. తద్వారా ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన ప్లేయర్‌గా ఉసామా చరిత్రకెక్కాడు. తుది జట్టులో లేకుండా.. కంకషన్ ద్వారా ఉసామాకు ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చేసే అవకాశం దక్కింది.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే బవుమా కొట్టిన బంతిని ఆపి త్రో చేస్తున్న సమయంలో పాకిస్థాన్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ గాయపడ్డాడు. బంతిని విసిరే క్రమంలో షాదాబ్ తల నేలకు బలంగా గుద్దుకోవడంతో.. వెంటనే అప్రమత్తమైన వైద్య సిబ్బంది మైదానంలోకి వచ్చి అతడిని పరీక్షించారు. తల తిరుగుతున్నట్లు ఉందని.. చెప్పిన షాదాబ్‌ను స్ట్రెచర్ మీద మైదానం నుంచి బయటకు తీసుకెళ్లాలని ప్రయత్నించగా.. అవసరం లేదని అతడే నడుచుకుంటూ బయటకు వెళ్లాడు. అయితే పరిస్థితి తీవ్రత దృష్ట్యా పాకిస్థాన్ జట్టు అతడి స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఉసామాను బరిలోకి దింపింది.
తొలి ఓవర్లోనే వికెట్
కంకషన్‌గా మైదానంలోకి వచ్చిన ఉసామా.. వచ్చీ రాగానే జట్టుకు అవసరమైన బ్రేక్ త్రూ అందించాడు. తన తొలి ఓవర్లోనే ప్రమాదక డసెన్‌ను పెవిలియన్ చేర్చాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ నాలుగో బంతికి డసెన్ వికెట్ల ముందు దొరికిపోగా.. అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. రివ్యూ తీసుకున్న సఫారీలకు ఫలితం లేకపోయింది. దీంతో దక్షిణాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. బ్యాటింగ్‌లో చక్కటి ప్రదర్శన చేసిన షాదాబ్.. బౌలింగ్‌లోనూ రాణిస్తాడని పాక్ జట్టు ఆశలు పెట్టుకుంటే.. అనుకోని అవాంతరం వల్ల జట్టు అతడి సేవలు కోల్పోవాల్సి వచ్చింది. అయితే అభిమానులు మాత్రం ఇందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ టోర్నీలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన షాదాబ్ ఖాన్ కంటే.. ఉసామా మీర్ మెరుగైన బౌలర్ అని కామెంట్స్ చేస్తున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపే పోలింగ్.. సర్వం సిద్ధం చేశామన్న ఎన్నికల కమిషనర్..!
Supreme Court Bench | చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయండి.. ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
Iran | భారత నౌకలకు హర్మూజ్‌లో ప్రత్యేక మినహాయింపు ఇచ్చిన ఇరాన్..!
Panchayat Secretaries | డోన్ట్ కేర్.. హాజరు వేసుకొని ఇంటికెళ్తున్న పంచాయతీ కార్యదర్శులు..!
Double Murder | మీర్పేట్లో జంట హత్యల కలకలం.. పోలీసుల నిర్లక్ష్యమే కారణమా..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

