PAK vs ENG: ఈడెన్ గార్డెన్ ఇంగ్లండుదే.. లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టిన పాక్
PAK vs ENG: సెమీస్ రేసులో నిలవాలంటే భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ అన్ని రంగాల్లో విఫలమై మరోసారి లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ తమ ప్రయాణాన్ని విజయంతో ముగించింది.
PAK vs ENG: వన్డే వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ తమ ప్రయాణాన్ని విజయంతో ముగించింది. సెమీస్ రేసులో నిలవాలంటే భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ అన్ని రంగాల్లో విఫలమై మరోసారి లీగ్ దశలోనే (2011 తర్వాత పాక్ సెమీస్ చేరలేదు) ఇంటిముఖం పట్టింది. ఇంగ్లండ్ – పాకిస్తాన్ మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లీష్ జట్టు నిర్దేశించిన 338 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్.. 43.3 ఓవర్లలో 244 పరుగులకే కుప్పకూలింది. తద్వారా ఇంగ్లండ్.. 93 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్‌కు ఇది మూడో విజయం. ప్రస్తుత ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న ఇంగ్లండ్.. 2025లో పాకిస్తాన్ వేదికగా జరగాల్సి ఉన్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అర్హత సాధించింది.
ఈ మ్యాచ్‌కు ముందు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌ను అధిగమించి సెమీస్ చేరాలంటే భారీ విజయం సాధించాల్సి ఉండగా టాస్‌తోనే ఆ ఆశలు అడియాసలయ్యాయి. ఇంగ్లండ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుని పాక్ ఎదుట 338 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. భారీ ఛేదనను పాకిస్తాన్.. 6.4 ఓవర్లలో ఛేదించాల్సి ఉండగా ఇన్నింగ్స్ రెండో బంతికే బాబర్ సేనకు భారీ షాక్తాకింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (0) ఔట్ అవగా పాక్ భారీ ఆశలు పెట్టుకున్న ఫఖర్ జమాన్ (1) కూడా నిలవలేదు 6.4 ఓవర్లలో పాక్ 30 పరుగులు మాత్రమే చేయగలిగింది. అక్కడ్నుంచి బాబర్ సేన ఏ దశలోనూ లక్ష్యం వైపుగా కదలలేదు.
కెప్టెన్ బాబర్ ఆజమ్ (45 బంతుల్లో 38, 6 ఫోర్లు), మహ్మద్ రిజ్వాన్ (51 బంతుల్లో 36, 2 ఫోర్లు) మూడో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. కానీ బాబర్‌ను అట్కిన్సన్ ఔట్ చేయడంతో పాక్ పతనం వేగంగా సాగింది. రిజ్వాన్‌ను మోయిన్ అలీ ఔట్ చేయగా సౌద్ షకీల్ (29) ను అదిల్ రషీద్ పెవిలియన్ చేర్చాడు. మిడిలార్డర్ బ్యాటర్ అఘా సల్మాన్ (45 బంతుల్లో 51, 6 ఫోర్లు, 1 సిక్సర్) అర్థ సెంచరీతో పాక్‌ను ఆదుకోకుంటే ఆ జట్టు ఆ మాత్రం స్కోరైనా చేసి ఉండేది కాదు. ఆఖర్లో షహీన్ షా అఫ్రిది (23 బంతుల్లో 25, 3 ఫోర్లు, 1 సిక్సర్), హరీస్ రౌప్ (23 బంతుల్లో 35, 3 ఫోర్లు, 3 సిక్సర్లు), మహ్మద్ వసీం (14 బంతుల్లో 16 నాటౌట్, 2 ఫోర్లు, సిక్సర్) మెరుపులతో పాక్ ఓటమి అంతరాన్ని తగ్గించారు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే మూడు వికెట్లు తీయగా అదిల్ రషీద్, అట్కిన్సన్, మోయిన్ అలీలు తలా రెండు వికెట్లు పడగొట్టారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

