Ronaldo vs Messi | రొనాల్డో, మెస్సీ ఎగ్జిబిషన్ మ్యాచ్.. టికెట్ల కోసం 20 లక్షల మంది ఎదురుచూపు
ఫహద్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జనవరి 19న తలపడనున్న మెస్సీ, రొనాల్డో
Ronaldo vs Messi : ఫిఫా వరల్డ్ కప్ తర్వాత మరో ఆసక్తికరమైన పోరు ఫుట్‌బాల్ అభిమానులను అలరించనుంది. అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ, పోర్చుగల్ స్ట్రైకర్ క్రిస్టియానో రొనాల్డో ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో తలపడనున్నారు. జనవరి 19న ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు సౌదీ అరేబియాలోని కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదిక కానుంది. ఈ స్టేడియం సామర్థ్యం 68 వేల మంది మాత్రమే.. అయితే.. ఈ స్టార్ ఆటగాళ్ల పోరును మైదానంలో చూసేందుకు లక్షలాది మంది ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత రొనాల్డో, మెస్సీ మైదానంలో పడుతుండడంతో టికెట్లు కావాలంటూ 20 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
జనవరి 19న సౌదీ అరేబియా క్లబ్ అల్ నస్రీ తరఫున రొనాల్డో తొలి మ్యాచ్ ఆడనున్నాడు. మెస్సీ కెప్టెన్సీలోని పీఎస్జీ క్లబ్‌తో అల్ నస్రీ, అల్ హిలాల్ క్లబ్ సభ్యుల జట్టు తలపడనుంది. రొనాల్డో, మెస్సీ చివరిసారి 2020 డిసెంబర్లో యూఈఎఫ్ఏ ఛాంపియన్ లీగ్‌లో ముఖాముఖిగా తలపడ్డారు. ఆ మ్యాచ్‌లో రొనాల్డో కెప్టెన్సీలోని జువెంటస్ ఫుట్‌బాల్ క్లబ్, మెస్సీ నాయకత్వంలోని బార్సిలోనాను 3-0తో ఓడించింది.
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో మెస్సీ రెండు గోల్స్ కొట్టి అర్జెంటీనాను విజేతగా నిలిపాడు. కానీ, రొనాల్డో మాత్రం బెంచ్‌కే పరిమితం అయ్యాడు. అంతేకాదు మాంచెస్టర్ క్లబ్ అతనితో కాంట్రాక్ట్ రద్దు చేసుకుంది. సౌదీ అరేబియాకు చెందిన అల్ నస్రీ క్లబ్ రొనాల్డోను భారీ ధరకు సొంతం చేసుకుంది. 2025 వరకు ఈ స్టార్ ప్లేయర్ ఆ క్లబ్‌తో కొనసాగనున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

