Glenn Phillips : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ కోసం విదేశీ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా భారత్ వస్తున్నారు. ఈమధ్యే పొట్టి ప్రపంచకప్‌లో ఇరగదీసిన గ్లెన్ ఫిలిఫ్స్ (Glenn Phillips) గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడేందుకు శనివారం ఇండియాలో దిగాడు. విమానాశ్రయంలో ఈ కివీస్ ఆల్‌రౌండర్‌కు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఫ్లయింగ్ మ్యాన్‌గా పేరొందిన ఫిలిప్స్ రాకకు సంకేతంగా గుజరాత్ ప్రత్యేక వీడియో పంచుకుంది.
మైదానంలో పక్షిని తలపిస్తూ.. బౌండరీ లైన్ వద్ద డైవింగ్ క్యాచ్‌లతో అలరించే గ్లెన్ ఫిలిప్స్ ఐపీఎల్ కోసం భారత్‌లో అడుగుపెట్టాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున బరిలోకి దిగనున్న ఈ కివీస్ ఆటగాడు శనివారం అహ్మదాబాద్‌లో విమానం దిగి.. స్క్వాడ్‌తో కలిశాడు. ప్రపంచ క్రికెట్లో ఫ్లయింగ్ మ్యాన్‌గా పేరొందని అతడి రాకను పునస్కరించుకొని గుజరాత్ ఫ్రాంచైజీ ఎక్స్‌లో ప్రత్యేకమైన పోస్ట్ పెట్టింది.
PSA: 𝙎𝙪𝙥𝙚𝙧 𝙂𝙡𝙚𝙣𝙣 has just been spotted in Amdavad! 🦸♂️🏡 pic.twitter.com/NJiwJ6KdPE
— Gujarat Titans (@gujarat_titans) March 20, 2026
Safe and secured ft. Glenn Phillips 😌 pic.twitter.com/TSuwPLBdTK
— Gujarat Titans (@gujarat_titans) March 21, 2026
సర్వర్ చేతు ల్లోంచి జారిపోతున్న టీ కప్పు.. గోడ మీద నుంచి కింద పడుతున్న గాజు గ్లాసు, ఓ వ్యక్తి చేతుల్లోంచి జారిపోతున్న ఫోన్‌తో వీడియో మొదలవుతుంది. టీ కప్పు, గాజు గ్లాస్, ఫోన్ కిందపడకుండా.. ఫిలిఫ్స్ ఒడుపుగా అందుకుంటాడు. ఈ స్పెషల్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.
😍🔥 Oddly satisfying… but make it CRICKET CORE!
Glenn Phillips unpacking his
New Balance kit = pure dopamine 🧿Neatly placed gear. Clean setup. Focused vibes ✨
You can literally feel the preparation before the storm. 😈#GlennPhillips #IPL2026 pic.twitter.com/HmLYcycBdG— ND Sport (@SportsByND) March 21, 2026
గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన ఫిలిఫ్స్ పంతొమ్మిదో సీజన్లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ తొలి పోరులో మార్చి 31న పంజాబ్ కింగ్స్(Punjab Kings)ను ఢీ కొట్టనుంది.