భారత ఆర్చర్ల విజయాలకు ఎన్టీపీసీ తోడ్పాటు
ఆసియా క్రీడల్లో తెలంగాణ అమ్మాయి తానిపర్తి చికిత తెచ్చిన రెండు స్వర్ణాలు సహా దేశ ఆర్చర్లు 9 పతకాలతో చారిత్రాత్మక విజయం సాధించడంలో ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ సహకారం ఎంతగానో తోడ్పడిందని భారత ఆర్చరీ సంఘం అధ్యక్షుడు అర్జున్ ముండా కొనియాడారు.
హైదరాబాద్: ఆర్చరీ అభివృద్ధి కోసం ఎన్టీపీసీ 2018 నుంచి తన కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద మద్దతును అందిస్తోందని తెలిపారు. భారత ఆర్చరీ కోసం ఎన్టీపీసీ వివిధ కార్యక్రమాలకు రూ.152.88 కోట్ల సహకారం అందించింది.
2030 వరకు ఉన్న ఒప్పందంలో భాగంగా ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడం, శిక్షణ, పరికరాలు, స్కాలర్షిప్లు, అకాడమీల అభివృద్ధితో పాటు పోటీల్లో పాల్గొనే అవకాశాలను కల్పిస్తోంది. అలాగే,ధనుర్విద్య ప్రాజెక్టు ద్వారా చిన్న వయసులోనే ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తున్న ఎన్టీపీసీ ఈ కార్యక్రమాన్ని 2030 మార్చి వరకు పొడిగించింది. ఆసియాడ్లో భారత ఆర్చర్లు సాధించిన పతకాలు ఆర్చర్లకు కేంద్ర ప్రభుత్వం, సాయ్, ఎన్టీపీసీ అందిస్తున్న సహకార ఫలితమని అర్జున్ ముందా పేర్కొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

