జొకో @ 50
- నొవాక్ క్వార్టర్ ఫైనల్స్ హాఫ్‌సెంచరీ

లండన్: ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్‌లో జోరు కొనసాగిస్తున్నాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఈ సెర్బియా వీరుడు అలవోక విజయంతో క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. మేజర్ టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టడం జొకోవిచ్‌కు ఇది 50వ సారి కాగా.. వింబుల్డన్‌లో క్వార్టర్స్ చేరడం 12వ సారి. ఈ జాబితాలో స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ (18 సార్లు) ముందు వరుసలో ఉన్నాడు. సోమవారం పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో జొకోవిచ్ 6-2, 6-4, 6-2తో పదిహేడో సీడ్ క్రిస్టియన్ గారిన్ (చిలీ)పై విజయం సాధించాడు. గంటా 49 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం కనబర్చిన జోకర్ 9 ఏస్‌లు బాది 5 బ్రేక్ పాయింట్లు సాధించాడు. తొలి సెట్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన గారిన్.. రెండో సెట్లో కాస్త తేరుకున్నా.. 5 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. బుధవారం క్వార్టర్స్‌లో మర్టాన్ ఫుసోవిక్స్ (హంగేరి)తో జొకో తలపడనున్నాడు. ఇతర ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో కరెన్ కచనోవ్ 3-6, 6-4, 6-3, 5-7, 10-8తో సెబాస్టియన్ పై.. షపలోవ్ 6-1, 6-3, 7-5తో బటిస్టా అగట్పై.. బెరెటిని 6-4, 6-3, 6-1తో ఇల్యా ఇవష్కాపై గెలిచారు. ఈ ముగ్గురు వింబుల్డన్ క్వార్టర్స్‌కు చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం.

స్వియాటెక్ ఔట్
మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ ఆష్లే బార్టీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్స్‌లో బార్టీ 7-5, 6-3తో క్రెజికోవా పై విజయం సాధించింది. గంటా 35 నిమిషాల్లో ముగిసిన పోరులో బార్టీ ఏడు ఏస్‌లు సంధించగా.. క్రెజికోవా నాలుగింటికే పరిమితమైంది. ఇగా స్వియోటెక్ 7-5, 1-6, 1-6తో జేబుర్ చేతిలో ఓడగా.. 17 ఏండ్ల అమెరికా యువ సంచలనం కొకొ గాఫ్ 4-6, 4-6తో కెర్బర్‌పై పోరాడి ఓడింది. రెండో సీడ్ సబలెంక 6-3, 4-6, 6-3తో ఎలెనా రైబకినాపై.. ప్లిస్కోవా 6-2, 6-3తో సామ్సొనోవాపై గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

